Emi seppeene tana yemmelu seluladoda

ఏమి చెప్పీనే తన యెమ్మెలు చెలులతోడ
Language

(॥పల్లవి॥)
ఏమి చెప్పీనే తన యెమ్మెలు చెలులతోడ
నా మగఁడే యెరుఁగును నా లాగూ

(॥ఏమి॥)
మచ్చికమాఁటలు చల్లి మందులు నూరీఁదాను
యిచ్చకపుదానను నాయీడా తాను
పచ్చిదేరేనవ్వులను పదనులు చూచీఁదాను
అచ్చమైనయిల్లాల నాయంతటిదా తాను

(॥ఏమి॥)
తిలకించి సిగ్గులనే తెరలుగటీఁదాను
తలఁపులోదాన నాయంతటిదా తాను
వెలినుండి వలపుల వేడుకలు చల్లీఁదాను
తొలుతటిదాన నాతోటితాదా తాను

(॥ఏమి॥)
చెనకుల చేఁతలనే చిగిరించీఁదాను
చనవరిదానను నాసాటి తాను
యెనసి శ్రీవేంకటేశుఁడిన్నిటా నన్ను మన్నించె
పనికి వచ్చితిని నాపాటిదా తాన

(||pallavi||)
emi sĕppīne tana yĕmmĕlu sĕluladoḍa
nā magam̐ḍe yĕrum̐gunu nā lāgū

(||emi||)
machchigamām̐ṭalu salli maṁdulu nūrīm̐dānu
yichchagabudānanu nāyīḍā tānu
pachchiderenavvulanu padanulu sūsīm̐dānu
achchamainayillāla nāyaṁtaḍidā tānu

(||emi||)
tilagiṁchi siggulane tĕralugaḍīm̐dānu
talam̐pulodāna nāyaṁtaḍidā tānu
vĕlinuṁḍi valabula veḍugalu sallīm̐dānu
tŏludaḍidāna nādoḍidādā tānu

(||emi||)
sĕnagula sem̐talane sigiriṁchīm̐dānu
sanavaridānanu nāsāḍi tānu
yĕnasi śhrīveṁkaḍeśhum̐ḍinniḍā nannu manniṁchĕ
panigi vachchidini nābāḍidā tāna