ఏమి చెప్పెడినో శాస్త్రరహస్యము యేమి చెప్పెడినో వేదములు
(॥పల్లవి॥)
ఏమి చెప్పెడినో శాస్త్రరహస్యము యేమి చెప్పెడినో వేదములు
తామసమై బహునాయకమాయను తత్త్వ మెఱంగఁగఁ దరమేదయ్యా
(॥ఏమి॥)
కొన్నిజంతువులు రోసిన హేయము కొన్నిజంతువుల కమృతము
కొన్నిజంతువుల దివములే రాత్రులు కొన్నిజంతువులకు
అన్నియు నిట్లనె వొక్కటొక్కటికి అన్యోన్య విరుద్ధములు
పన్నిన జీవుల కేకసమ్మతము భావించఁగ మరి ఇఁక నేదయ్యా
(॥ఏమి॥)
కొందరు విడిచిన సంసారము మరికొందరికి నది భోగ్యంబు
కొందరి వునుకులు వూర్ధ్వలోకములు కొందరివునుకులు పాతాళంబు
అందరు నందరె వారివారి రుచు లివిగాదిది(వి?) యనరాదు
కందువ జీవులు విచారించేటి కార్యాకార్యము లిఁకనేదయ్యా
(॥ఏమి॥)
కొంతభూమి నటు చీఁకటినిండినఁ గొంతభూమి వెన్నెల గాయు
కొంతట సురలును కొంతట నసురలు కోరికై కొనిరి జగమెల్లా
ఇంతట శ్రీవేంకటేశ్వర నీవే యిందరి యంతర్యామివి
చింతలు వాయవు యెవ్వరిమనసునఁ జేరి నీకు శరణంటేఁ గాని
(||pallavi||)
emi sĕppĕḍino śhāstrarahasyamu yemi sĕppĕḍino vedamulu
tāmasamai bahunāyagamāyanu tattva mĕṟaṁgam̐gam̐ daramedayyā
(||emi||)
kŏnnijaṁtuvulu rosina heyamu kŏnnijaṁtuvula kamṛtamu
kŏnnijaṁtuvula divamule rātrulu kŏnnijaṁtuvulagu
anniyu niṭlanĕ vŏkkaḍŏkkaḍigi anyonya viruddhamulu
pannina jīvula kegasammadamu bhāviṁcham̐ga mari im̐ka nedayyā
(||emi||)
kŏṁdaru viḍisina saṁsāramu marigŏṁdarigi nadi bhogyaṁbu
kŏṁdari vunugulu vūrdhvalogamulu kŏṁdarivunugulu pādāḽaṁbu
aṁdaru naṁdarĕ vārivāri rusu livigādidi(vi?) yanarādu
kaṁduva jīvulu visāriṁcheḍi kāryāgāryamu lim̐kanedayyā
(||emi||)
kŏṁtabhūmi naḍu sīm̐kaḍiniṁḍinam̐ gŏṁtabhūmi vĕnnĕla gāyu
kŏṁtaḍa suralunu kŏṁtaḍa nasuralu korigai kŏniri jagamĕllā
iṁtaḍa śhrīveṁkaḍeśhvara nīve yiṁdari yaṁtaryāmivi
siṁtalu vāyavu yĕvvarimanasunam̐ jeri nīgu śharaṇaṁṭem̐ gāni