Emi seppedi vehamu yemtogaani

ఏమి చెప్పేది వెూహము యెంతోకాని
Language

(॥పల్లవి॥)
ఏమి చెప్పేది వెూహము యెంతోకాని
కామిని నింతట నిట్టె కరుణించవయ్యా

(॥॥)
చెలి నిన్నుఁ జూచి చూచి చిమ్మిరేఁగీ నాసలను
యెలమిఁ బయ్యదఁ జారు టెఱఁగదు
వెలలేని మాఁటలెల్లా వేడుకతో నాడీఁగాని
లలిఁ బెదవిమీఁది కెంపులు దాఁచనేరదు

(॥॥)
మొగమెత్తి చేతులెత్తి, మొక్కిలోలోఁ జొక్కీ
జిగిఁ చఁన్నులు గానవచ్చేది యెంచదు
మిగులా సెలవులను మిక్కిలి నవ్వీఁగాని
చిగురుమోవిరసాలు చిందేది దలఁచదు

(॥॥)
తక్కక కొలువుసేసేతమినే నిలిచున్నది
పక్కన మైసోఁకులు భావించదు
యిక్కడ శ్రీవేంకటేశ యీకె యలమేలుమంగ
అక్కరతోఁ గూడీఁగాని అలయఁగ నేరదు

(||pallavi||)
emi sĕppedi vĕూhamu yĕṁtogāni
kāmini niṁtaḍa niṭṭĕ karuṇiṁchavayyā

(||||)
sĕli ninnum̐ jūsi sūsi simmirem̐gī nāsalanu
yĕlamim̐ bayyadam̐ jāru ṭĕṟam̐gadu
vĕlaleni mām̐ṭalĕllā veḍugado nāḍīm̐gāni
lalim̐ bĕdavimīm̐di kĕṁpulu dām̐saneradu

(||||)
mŏgamĕtti sedulĕtti, mŏkkilolom̐ jŏkkī
jigim̐ sam̐nnulu gānavachchedi yĕṁchadu
migulā sĕlavulanu mikkili navvīm̐gāni
sigurumovirasālu siṁdedi dalam̐sadu

(||||)
takkaga kŏluvusesedamine nilisunnadi
pakkana maisom̐kulu bhāviṁchadu
yikkaḍa śhrīveṁkaḍeśha yīgĕ yalamelumaṁga
akkaradom̐ gūḍīm̐gāni alayam̐ga neradu