ఏమి చెప్పేది తన యెమ్మెలు నేఁడు
(॥పల్లవి॥)
ఏమి చెప్పేది తన యెమ్మెలు నేఁడు
ఆముకొని కాచుకున్నాఁ డత్తునా యేమైనా
(॥॥)
అలసిన వారికేల అట్టె పనులు చెప్పీనే
కలసినవారికేల కాఁకరేఁచీనే
మొలకచన్నులు చూచి మొక్కీ నింతటిలోనే
తలఁచిసవరమియ్యఁదనకు దేవరలా
(॥॥)
సిగ్గు వడ్డవారి నెంత చిమ్మిరేఁచవచ్చీనే
యెగ్గులేనివారినేల యెచ్చరించీనే
నిగ్గులనామోవి చూచి నిలువుఁగొలువు సేసీ
అగ్గలమై సేవగొన నది దనయేలికా
(॥॥)
వూరకున్నవారినేల వొడివట్టి కూడీనే
యీరీతి శ్రీవెంకటేశుఁ డెంత సేసీనే
గారవించి నామేను కప్పిదాఁచీఁ బచ్చడాన
నేరుపున రక్షించునిధానమా
(||pallavi||)
emi sĕppedi tana yĕmmĕlu nem̐ḍu
āmugŏni kāsugunnām̐ ḍattunā yemainā
(||||)
alasina vārigela aṭṭĕ panulu sĕppīne
kalasinavārigela kām̐karem̐sīne
mŏlagasannulu sūsi mŏkkī niṁtaḍilone
talam̐sisavaramiyyam̐danagu devaralā
(||||)
siggu vaḍḍavāri nĕṁta simmirem̐savachchīne
yĕggulenivārinela yĕchchariṁchīne
niggulanāmovi sūsi niluvum̐gŏluvu sesī
aggalamai sevagŏna nadi danayeligā
(||||)
vūragunnavārinela vŏḍivaṭṭi kūḍīne
yīrīdi śhrīvĕṁkaḍeśhum̐ ḍĕṁta sesīne
gāraviṁchi nāmenu kappidām̐sīm̐ bachchaḍāna
nerubuna rakṣhiṁchunidhānamā