Emi seppedi nee suddulu yemtavaamdavu

ఏమి చెప్పేది నీ సుద్దులు యెంతవాఁడవు
Language

(॥పల్లవి॥)
ఏమి చెప్పేది నీ సుద్దులు యెంతవాఁడవు
చే ముట్టి నామీఁద నిట్టె సేసలు చల్లేవు

(॥॥)
ముచ్చట నెవ్వతైనా నీమోము చూచితేఁ జాలు
చెచ్చెర మేనవాని చెప్పుకొందువు
మచ్చికతో నొకమారు మాఁటాడితేఁ జాలు
గచ్చుల నంతటిలో కంకణము గట్టుదువు

(॥॥)
చెంగట మగవాఁడని సిగ్గువడితేఁ జాలు
సంగడి నందుకే సరసమాడుదువు
ముంగిటికి నీవు రాఁగా మొనసి మొక్కితేఁ జాలు
కొంగువట్టి పెనఁగి గక్కునఁ గాఁగిలింతువు

(॥॥)
చిప్పిలు నీసేఁతలకు సెలవి నవ్వితేఁ జాలు
దప్పి దేర మోవి యాని తగులుదువు
యిప్పుడిట్టే శ్రీవేంకటేశ నన్ను నేలితివి
వొప్పుగ రేయిఁబగలు వొనగూడి యుందువు

(||pallavi||)
emi sĕppedi nī suddulu yĕṁtavām̐ḍavu
se muṭṭi nāmīm̐da niṭṭĕ sesalu sallevu

(||||)
muchchaḍa nĕvvadainā nīmomu sūsidem̐ jālu
sĕchchĕra menavāni sĕppugŏṁduvu
machchigado nŏgamāru mām̐ṭāḍidem̐ jālu
gachchula naṁtaḍilo kaṁkaṇamu gaṭṭuduvu

(||||)
sĕṁgaḍa magavām̐ḍani sigguvaḍidem̐ jālu
saṁgaḍi naṁduge sarasamāḍuduvu
muṁgiḍigi nīvu rām̐gā mŏnasi mŏkkidem̐ jālu
kŏṁguvaṭṭi pĕnam̐gi gakkunam̐ gām̐giliṁtuvu

(||||)
sippilu nīsem̐talagu sĕlavi navvidem̐ jālu
dappi dera movi yāni taguluduvu
yippuḍiṭṭe śhrīveṁkaḍeśha nannu nelidivi
vŏppuga reyim̐bagalu vŏnagūḍi yuṁduvu