Emi seppedi nee suddu limdarilona

ఏమి చెప్పేది నీ సుద్దు లిందరిలోన
Language

(॥పల్లవి॥)
ఏమి చెప్పేది నీ సుద్దు లిందరిలోన
వేమరుఁ జూచి చూచి వెరగయ్యీ నిపుడు

(॥ఏమి॥)
మగువరో పతితోడ మాఁటలాడఁ జాలను
చిగురువంటి నీమోవి చిల్లులయ్యీనా
నిగిడి వద్ద గూచుంటే నీకేమే వలపులు
జిగురువలె నంటుక చిమ్మిరేఁచీనా

(॥ఏమి॥)
చెనకి యీతనితోడఁ జేరి పెనఁగ వదేమే
ఘనమైన నీ చన్నులు కాయగాచీనా
మొనసి వేడుకతోడ మోమెత్తి చూచితే నేమే
ననుపుల తమకము నామునెక్కీనా

(॥ఏమి॥)
యెరవు సేయక బాగా లీతనికిచ్చితే నేమే
వరుస నీకొనగొళ్లవాఁడి వొయ్యీనా
యిరవై శ్రీవేంకటేశుఁ డేలె నివ్వెరగందేవు
కరఁగి నీమనసిట్టె కాలువ గట్టీనా

(||pallavi||)
emi sĕppedi nī suddu liṁdarilona
vemarum̐ jūsi sūsi vĕragayyī nibuḍu

(||emi||)
maguvaro padidoḍa mām̐ṭalāḍam̐ jālanu
siguruvaṁṭi nīmovi sillulayyīnā
nigiḍi vadda gūsuṁṭe nīgeme valabulu
jiguruvalĕ naṁṭuga simmirem̐sīnā

(||emi||)
sĕnagi yīdanidoḍam̐ jeri pĕnam̐ga vademe
ghanamaina nī sannulu kāyagāsīnā
mŏnasi veḍugadoḍa momĕtti sūside neme
nanubula tamagamu nāmunĕkkīnā

(||emi||)
yĕravu seyaga bāgā līdanigichchide neme
varusa nīgŏnagŏḽlavām̐ḍi vŏyyīnā
yiravai śhrīveṁkaḍeśhum̐ ḍelĕ nivvĕragaṁdevu
karam̐gi nīmanasiṭṭĕ kāluva gaṭṭīnā