Emi seppedi nee suddu liduvamtivi

ఏమి చెప్పేది నీ సుద్దు లిటువంటివి
Language

(॥పల్లవి॥)
ఏమి చెప్పేది నీ సుద్దు లిటువంటివి
గోమున లోకరక్షణకొఱకు నిట్లైతివి

(॥ఏమి॥)
అట్టె నాఁడు వేదచోరు నద టడంచిన నీవు
నెట్టన నేఁడెట్టు నవనీత చోరుఁడ వైతివి
జట్టిగా బ్రహ్మదులకు జనకుఁడవైన నీవు
గుట్టున వసుదేవున కొడుక వెట్లైతివి

(॥ఏమి॥)
చేముంచి జితకాములచేతికి లోనైన నీవు
యేమీ రేపల్లె జారుఁడ వేలైతివి
ఆమీఁద జగద్గురుఁడవై వుండిన యట్టి నీవు
సీమలో సాందీపనికి శిష్యుడ వెట్లైతివి

(॥ఏమి॥)
కోటుల బ్రహ్మాండములు కుక్షి నిడుకొన్న నీవు
ఆటలకు బలి నేల యాచించితివి
వాటమై శ్రీవేంకటేశ వరము లిందరి కిచ్చి
నీటునఁ బరుషల కానికె లేల కొంటివి

(||pallavi||)
emi sĕppedi nī suddu liḍuvaṁṭivi
gomuna logarakṣhaṇagŏṟagu niṭlaidivi

(||emi||)
aṭṭĕ nām̐ḍu vedasoru nada ṭaḍaṁchina nīvu
nĕṭṭana nem̐ḍĕṭṭu navanīda sorum̐ḍa vaidivi
jaṭṭigā brahmadulagu janagum̐ḍavaina nīvu
guṭṭuna vasudevuna kŏḍuga vĕṭlaidivi

(||emi||)
semuṁchi jidagāmulasedigi lonaina nīvu
yemī reballĕ jārum̐ḍa velaidivi
āmīm̐da jagadgurum̐ḍavai vuṁḍina yaṭṭi nīvu
sīmalo sāṁdībanigi śhiṣhyuḍa vĕṭlaidivi

(||emi||)
koḍula brahmāṁḍamulu kukṣhi niḍugŏnna nīvu
āḍalagu bali nela yāsiṁchidivi
vāḍamai śhrīveṁkaḍeśha varamu liṁdari kichchi
nīḍunam̐ baruṣhala kānigĕ lela kŏṁṭivi