ఏమి చెప్పేది నా బ్రదుకిట్టాయఁగా
(॥పల్లవి॥)
ఏమి చెప్పేది నా బ్రదుకిట్టాయఁగా
నా మతిలో సిగ్గులేక నవ్వు నవ్వేఁగా
(॥ఏమి॥)
యెన్నఁడు బాసి యుండనెరఁగని నావలపు
యిన్నిటా నేఁడెంచుకొంటే యిట్టాయఁగా
కన్నులఁ జూడక వుంటే కళవళించే నేను
మన్నన నీచెలులతో మాటలాడేఁగా
(॥ఏమి॥)
చక్కని నీమేనిమీఁదఁ జాఁచేటి నాచేయి
చెక్కుకిందికిటు వచ్చి చింతాయఁగా
అక్కరతో నిన్నుఁ గూడి అలరేటి యీదినాలు
నిక్కి నిక్కి చూపులకు నెలవాయఁగా
(॥ఏమి॥)
దూరమైతిన నిన్ను దూరేటి నానోరు
వోరి నీమోవి యానఁగ నొద్దికాయఁగా
నేరిచి శ్రీవేంకటేశ నేఁడు నన్ను మన్నించఁగ
కోరిన నాకోరికలు కొనసాగెఁగా
(||pallavi||)
emi sĕppedi nā bradugiṭṭāyam̐gā
nā madilo siggulega navvu navvem̐gā
(||emi||)
yĕnnam̐ḍu bāsi yuṁḍanĕram̐gani nāvalabu
yinniḍā nem̐ḍĕṁchugŏṁṭe yiṭṭāyam̐gā
kannulam̐ jūḍaga vuṁṭe kaḽavaḽiṁche nenu
mannana nīsĕlulado māḍalāḍem̐gā
(||emi||)
sakkani nīmenimīm̐dam̐ jām̐seḍi nāseyi
sĕkkugiṁdigiḍu vachchi siṁtāyam̐gā
akkarado ninnum̐ gūḍi alareḍi yīdinālu
nikki nikki sūbulagu nĕlavāyam̐gā
(||emi||)
dūramaidina ninnu dūreḍi nānoru
vori nīmovi yānam̐ga nŏddigāyam̐gā
nerisi śhrīveṁkaḍeśha nem̐ḍu nannu manniṁcham̐ga
korina nāgorigalu kŏnasāgĕm̐gā