ఏమి చెప్పే రిఁక నీకు యెంత లేదీ సంతోసము
(॥పల్లవి॥)
ఏమి చెప్పే రిఁక నీకు యెంత లేదీ సంతోసము
వేమరు నిన్నాపె ఇంత వెలయించెఁగా
(॥ఏమి॥)
మనసు రంజిల్లఁ జేసి మంతనము నీతో నాడి
తినివిఁ బొందించెఁగా తరుణి నేఁడు
చనుఁగవ దాఁకించి సంగడినే కూచుండి
పెనుపొందని మోహము పెడరేఁచెఁగా
(॥ఏమి॥)
సెలవుల నవ్వు నవ్వి చేరి నీకుఁ బాదాలొత్తి
అలపెల్లాఁ దేర్చెఁగా అంగన నేఁడు
సొలపుఁ జూపులఁ జూచి సురటి నటువిసరి
యెలమి నీకోరికె లీడేర్చెఁగా
(॥ఏమి॥)
కప్పరపు విడెమిచ్చి కాఁగిట నిన్నుఁ గుచ్చి
నుప్పిరిఁ జొక్కించెఁగా ముదిత నేఁడు
ఇప్పుడె శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నీవు
తప్పక నిన్నాపె యింత తమిరేఁచెఁగా
(||pallavi||)
emi sĕppe rim̐ka nīgu yĕṁta ledī saṁtosamu
vemaru ninnābĕ iṁta vĕlayiṁchĕm̐gā
(||emi||)
manasu raṁjillam̐ jesi maṁtanamu nīdo nāḍi
tinivim̐ bŏṁdiṁchĕm̐gā taruṇi nem̐ḍu
sanum̐gava dām̐kiṁchi saṁgaḍine kūsuṁḍi
pĕnubŏṁdani mohamu pĕḍarem̐sĕm̐gā
(||emi||)
sĕlavula navvu navvi seri nīgum̐ bādālŏtti
alabĕllām̐ dersĕm̐gā aṁgana nem̐ḍu
sŏlabum̐ jūbulam̐ jūsi suraḍi naḍuvisari
yĕlami nīgorigĕ līḍersĕm̐gā
(||emi||)
kapparabu viḍĕmichchi kām̐giḍa ninnum̐ guchchi
nuppirim̐ jŏkkiṁchĕm̐gā mudida nem̐ḍu
ippuḍĕ śhrī veṁkaḍeśha yelidivi nannu nīvu
tappaga ninnābĕ yiṁta tamirem̐sĕm̐gā