ఏమి చెప్పే రీబుద్దు లెందాఁకా మీరు
(॥పల్లవి॥)
ఏమి చెప్పే రీబుద్దు లెందాఁకా మీరు
నేమము మీఁదటఁ గాని నెట్టుకోదు సమ్మతి
(॥ఏమి॥)
మొగమిచ్చమాటలు ముంచి యెన్ని ఆడినాను
తెగువలు చూపుక తేరదెంతైనా
నగవులు సెలవుల నవ్వి యెంత కొసరిన
తగవు పట్టునఁగాని తలఁపొడఁబడదు
(॥ఏమి॥)
సరసవుఁ జెనకులు సారె యెంత చెనకినా
నొరసి మేనులంటక వొద్దిక గాదు
వరుసవంతుల వట్టి వలపెంత చల్లినాను
సరవి రతులఁ గాని చవివుట్టదు
(॥ఏమి॥)
ఆసలె సారెకుఁ జూపి ఆయాలెంత ముట్టినాను
సేనవెట్టి పెండ్లాడక సిగ్గువాయదు
వేసరక నన్నిట్లే శ్రీవేంకటేశుఁడిదె కూడె
బాసలు సేసినఁగాని పట్టి పెనఁగరాదు
(||pallavi||)
emi sĕppe rībuddu lĕṁdām̐kā mīru
nemamu mīm̐daḍam̐ gāni nĕṭṭugodu sammadi
(||emi||)
mŏgamichchamāḍalu muṁchi yĕnni āḍinānu
tĕguvalu sūbuga teradĕṁtainā
nagavulu sĕlavula navvi yĕṁta kŏsarina
tagavu paṭṭunam̐gāni talam̐pŏḍam̐baḍadu
(||emi||)
sarasavum̐ jĕnagulu sārĕ yĕṁta sĕnaginā
nŏrasi menulaṁṭaga vŏddiga gādu
varusavaṁtula vaṭṭi valabĕṁta sallinānu
saravi radulam̐ gāni savivuṭṭadu
(||emi||)
āsalĕ sārĕgum̐ jūbi āyālĕṁta muṭṭinānu
senavĕṭṭi pĕṁḍlāḍaga sigguvāyadu
vesaraga nanniṭle śhrīveṁkaḍeśhum̐ḍidĕ kūḍĕ
bāsalu sesinam̐gāni paṭṭi pĕnam̐garādu