Emi seppe nimka mari yemdu soosinaam degadu

ఏమి చెప్పే నిఁక మరి యెందు చూచినాఁ దెగదు
Language

(॥పల్లవి॥)
ఏమి చెప్పే నిఁక మరి యెందు చూచినాఁ దెగదు
కోమలపు సతులకు గురియైనవాఁడవు

(॥ఏమి॥)
చేర నీవు రాకుండఁగ చెలులఁ గోపించేనంటే
దూరరానియట్టి బలుదొరవు నీవు
నేరక వలచితిని నేనే అనుకొనేనంటే
సారమైన మేళ్లిచ్చి సతమైనవాఁడవు

(॥ఏమి॥)
మది నిన్నుఁ బాసి వుండి మరునిఁ దిట్టేనంటే
వదలని మహిమ దేవరపు నీవు
పదరి నేనైనా గొంత పరాకై వుండేనంటే
యెదలోనఁ బ్రాణమవై ఇరవైన వాఁడవు

(॥ఏమి॥)
శిజాగు నీవు సేయఁగాను సవతుల ననేనంటే
భోగించనేర్చిన వల్లభుఁడవు నీవు
బాగుగ నిన్నుఁ గూడితి పంతములాడేనంటే
చేగలుదేరినయట్టి శ్రీ వేంకటేశుఁడవు

(||pallavi||)
emi sĕppe nim̐ka mari yĕṁdu sūsinām̐ dĕgadu
komalabu sadulagu guriyainavām̐ḍavu

(||emi||)
sera nīvu rāguṁḍam̐ga sĕlulam̐ gobiṁchenaṁṭe
dūrarāniyaṭṭi baludŏravu nīvu
neraga valasidini nene anugŏnenaṁṭe
sāramaina meḽlichchi sadamainavām̐ḍavu

(||emi||)
madi ninnum̐ bāsi vuṁḍi marunim̐ diṭṭenaṁṭe
vadalani mahima devarabu nīvu
padari nenainā gŏṁta parāgai vuṁḍenaṁṭe
yĕdalonam̐ brāṇamavai iravaina vām̐ḍavu

(||emi||)
śhijāgu nīvu seyam̐gānu savadula nanenaṁṭe
bhogiṁchanersina vallabhum̐ḍavu nīvu
bāguga ninnum̐ gūḍidi paṁtamulāḍenaṁṭe
segaluderinayaṭṭi śhrī veṁkaḍeśhum̐ḍavu