ఏమి చెప్పే మమ్మా మన మిద్దరి కిఁక బుద్దులు
(॥పల్లవి॥)
ఏమి చెప్పే మమ్మా మన మిద్దరి కిఁక బుద్దులు
తాముఁ దాము నేకమే తమకములు వేరు
(॥ఏమి చెప్పే॥)
తనువులే వేరు గాని తలఁపు లొక్కటే పో
అనుఁగు రమణునికి నంగనకును
కనుఁగొనలే రెండు కనుచూపూ లొక్కటే పో
పెనఁగొన్న భావనలే భేద మింతే కాని
(॥ఏమి చెప్పే॥)
పాయములే వేరు గాని ప్రాణము లొక్కటే పో
చాయల విభునికిని సతికిని
ఆయెడఁ జేతులు రెండు అంటుఁగౌఁగిలొక్కటే పో
యీయెడ వినయములే యిన్నేసి కాని
(॥ఏమి చెప్పే॥)
భావపురతులే వేరు పరవశ మొక్కటే పో
శ్రీవేంకటపతికిఁ జెలియకును
ఆవల మోవులే వేరు ఆధరామృత మొక్కటే
కావిరిఁ గళలు పెక్కై కమ్ముకొనెఁ గాని
(||pallavi||)
emi sĕppe mammā mana middari kim̐ka buddulu
tāmum̐ dāmu negame tamagamulu veru
(||emi sĕppe||)
tanuvule veru gāni talam̐pu lŏkkaḍe po
anum̐gu ramaṇunigi naṁganagunu
kanum̐gŏnale rĕṁḍu kanusūbū lŏkkaḍe po
pĕnam̐gŏnna bhāvanale bheda miṁte kāni
(||emi sĕppe||)
pāyamule veru gāni prāṇamu lŏkkaḍe po
sāyala vibhunigini sadigini
āyĕḍam̐ jedulu rĕṁḍu aṁṭum̐gaum̐gilŏkkaḍe po
yīyĕḍa vinayamule yinnesi kāni
(||emi sĕppe||)
bhāvaburadule veru paravaśha mŏkkaḍe po
śhrīveṁkaḍabadigim̐ jĕliyagunu
āvala movule veru ādharāmṛta mŏkkaḍe
kāvirim̐ gaḽalu pĕkkai kammugŏnĕm̐ gāni