ఏమి చెప్పే దమ్మా యిద్దరుఁ గూడిన రతి
(॥పల్లవి॥)
ఏమి చెప్పే దమ్మా యిద్దరుఁ గూడిన రతి
దోమటి మరుబలము దొమ్మె న ట్లున్నది
(॥ఏమి॥)
కొమ్మకుచములమ్మీఁది గోరికొన గుఱుతులు
చిమ్ముల నమరె నెఁడు చెల్లుబడులై
కమ్ముకొని యింద్రుఁడు రెక్కలు గల కొండలపై
వుమ్మడి వజ్రాయుధ మూఁదిన ట్లున్నది
(॥ఏమి॥)
అందపుఁ జెలియతురు మటు నిలువున వీడి
పొందుమాలి వేరొక్క పోలి కాయను
ముందరఁ జంద్రుఁడు వచ్చి మోహరించితేఁ జీఁకటి
పందయై వెనక తీసి పారినయ ట్లున్నది
(॥ఏమి॥)
శ్రీవేంకటేశ్వరుఁడు చెలిఁ గూడఁగా మేన
వావిరిఁ బులక లెల్ల వాము లాయను
సావిగాక చెమటలు జడివట్టి కురియఁగా
మోవరాని పయిరు లెల్ల మొలచిన ట్లుండెను
(||pallavi||)
emi sĕppe dammā yiddarum̐ gūḍina radi
domaḍi marubalamu dŏmmĕ na ṭlunnadi
(||emi||)
kŏmmagusamulammīm̐di gorigŏna guṟudulu
simmula namarĕ nĕm̐ḍu sĕllubaḍulai
kammugŏni yiṁdrum̐ḍu rĕkkalu gala kŏṁḍalabai
vummaḍi vajrāyudha mūm̐dina ṭlunnadi
(||emi||)
aṁdabum̐ jĕliyaduru maḍu niluvuna vīḍi
pŏṁdumāli verŏkka poli kāyanu
muṁdaram̐ jaṁdrum̐ḍu vachchi mohariṁchidem̐ jīm̐kaḍi
paṁdayai vĕnaga tīsi pārinaya ṭlunnadi
(||emi||)
śhrīveṁkaḍeśhvarum̐ḍu sĕlim̐ gūḍam̐gā mena
vāvirim̐ bulaga lĕlla vāmu lāyanu
sāvigāga sĕmaḍalu jaḍivaṭṭi kuriyam̐gā
movarāni payiru lĕlla mŏlasina ṭluṁḍĕnu