Emi seimchugomtivi yemamdu ninnu

ఏమి సేఇంచుకొంటివి యేమందు నిన్ను
Language

(॥పల్లవి॥)
ఏమి సేఇంచుకొంటివి యేమందు నిన్ను
కామించినవారికెల్లా కాఁతాళము పుట్టదా

(॥ఏమి॥)
చీటి వ్రాసి యెవ్వతే నీ శిరసునఁ జెక్కినది
చాటువగా నేనది చదువుకొంటి
తాటించి నీ మోవెల్లా తన యెంగిలేయట
ఆఁటది యీ మాట వింటే అంట సిగ్గు గాదా

(॥ఏమి॥)
కోరి ముద్దుటుంగరము కొంగుతోఁ గట్టినది
తేరి చూచి ఇది నేఁ దెలుసుకొంటి
బోరున నీమేను తానే భోగించినదనియేమో
బారచాఁచె నీకాఁగిలిపైఁ బంతము గాదా

(॥ఏమి॥)
పూవులదండ నీ మెడఁ బూఁచి సింగారించినది
శ్రీవేంకటేశుఁడ నేను భావించుకొంటి
నీ వొళ్లెల్లాఁ దనకే నిర్మాల్యమనుటిది
యీవేళ నన్నేలితివి యిఁక గొత్తగాదా

(||pallavi||)
emi seiṁchugŏṁṭivi yemaṁdu ninnu
kāmiṁchinavārigĕllā kām̐tāḽamu puṭṭadā

(||emi||)
sīḍi vrāsi yĕvvade nī śhirasunam̐ jĕkkinadi
sāḍuvagā nenadi saduvugŏṁṭi
tāḍiṁchi nī movĕllā tana yĕṁgileyaḍa
ām̐ṭadi yī māḍa viṁṭe aṁṭa siggu gādā

(||emi||)
kori mudduḍuṁgaramu kŏṁgudom̐ gaṭṭinadi
teri sūsi idi nem̐ dĕlusugŏṁṭi
boruna nīmenu tāne bhogiṁchinadaniyemo
bārasām̐sĕ nīgām̐gilibaim̐ baṁtamu gādā

(||emi||)
pūvuladaṁḍa nī mĕḍam̐ būm̐si siṁgāriṁchinadi
śhrīveṁkaḍeśhum̐ḍa nenu bhāviṁchugŏṁṭi
nī vŏḽlĕllām̐ danage nirmālyamanuḍidi
yīveḽa nannelidivi yim̐ka gŏttagādā