Emi sedune yaadam dettu vasamayyeeno

ఏమి సేతునే యాతఁ డెట్టు వసమయ్యీనో
Language

(॥పల్లవి॥)
ఏమి సేతునే యాతఁ డెట్టు వసమయ్యీనో
కామించి యున్నదానఁ గరుణించుమనవే

(॥ఏమి॥)
తక్కక తనరూపము తలపొసేనంటివా
మిక్కిలిచక్కఁదనాల మేఁటి యాతఁడు
చిక్కించుక యిట్టితనచిత్తము దెలిసేనంటే
గక్కన వూహించరానిగంభీరుడాతడు

(॥ఏమి॥)
జడియక తనుమెచ్చి సారెఁ బొగడేనంటె
కడలేని గుఱసాగరుఁ డాతఁడు
తడయక యేపొద్దు తను సేవించేనంటినా
కడుఁగడురాజసపుఘనుఁ డాతఁడు

(॥ఏమి॥)
సరసపు మాటలు సారె నాడేనంటినా
సరిలెనియట్టినెరజాణఁ డాతఁడు
బెరసి నన్నేలె తనుఁ బేరుకొనేనంటినా
గరిమల శ్రీవేంకటవిభుఁ డాతఁడు

(||pallavi||)
emi sedune yādam̐ ḍĕṭṭu vasamayyīno
kāmiṁchi yunnadānam̐ garuṇiṁchumanave

(||emi||)
takkaga tanarūbamu talabŏsenaṁṭivā
mikkilisakkam̐danāla mem̐ṭi yādam̐ḍu
sikkiṁchuga yiṭṭidanasittamu dĕlisenaṁṭe
gakkana vūhiṁcharānigaṁbhīruḍādaḍu

(||emi||)
jaḍiyaga tanumĕchchi sārĕm̐ bŏgaḍenaṁṭĕ
kaḍaleni guṟasāgarum̐ ḍādam̐ḍu
taḍayaga yebŏddu tanu seviṁchenaṁṭinā
kaḍum̐gaḍurājasabughanum̐ ḍādam̐ḍu

(||emi||)
sarasabu māḍalu sārĕ nāḍenaṁṭinā
sarilĕniyaṭṭinĕrajāṇam̐ ḍādam̐ḍu
bĕrasi nannelĕ tanum̐ berugŏnenaṁṭinā
garimala śhrīveṁkaḍavibhum̐ ḍādam̐ḍu