Emi sedune seliyaa yimta neegu valasidi

ఏమి సేతునే చెలియా యింత నీకు వలచితి
Language

(॥పల్లవి॥)
ఏమి సేతునే చెలియా యింత నీకు వలచితి
ఆముకొన్న నీ చేఁతలు ఆసలు వుట్టించీనే

(॥ఏమి॥)
తియ్యని నీమాటలఁ దేనెలు గారీఁగాని
గయ్యాళి జంకెనలఁ గాఁక రేఁగీనే
పయ్యదజారులవల్ల భావము గరఁగీఁగాని
చెయ్యరాని చెనకుల సిగ్గులు ముంచీనే

(॥ఏమి॥)
ననుపు నీచూపులు నమ్మికలు సేసీఁగాని
కనుచూపులై తేను కాఁడిపారీనే
వినయపు నీగుణాలు వేడుకలు చూపీఁగాని
కనకపుమైసోఁకులు కళలు దాఁకించీనె

(॥ఏమి॥)
యిచ్చకవు నీకాఁగిలి యింపు గెరలించీఁగాని
హెచ్చిన రతులెల్లాను యెలయించీనే
నిచ్చ శ్రీవేంకటేశుఁడ నేను నాకుదక్కితివి
తచ్చి చన్నులు మతఁగ పర్వతము మించీనే

(||pallavi||)
emi sedune sĕliyā yiṁta nīgu valasidi
āmugŏnna nī sem̐talu āsalu vuṭṭiṁchīne

(||emi||)
tiyyani nīmāḍalam̐ denĕlu gārīm̐gāni
gayyāḽi jaṁkĕnalam̐ gām̐ka rem̐gīne
payyadajārulavalla bhāvamu garam̐gīm̐gāni
sĕyyarāni sĕnagula siggulu muṁchīne

(||emi||)
nanubu nīsūbulu nammigalu sesīm̐gāni
kanusūbulai tenu kām̐ḍibārīne
vinayabu nīguṇālu veḍugalu sūbīm̐gāni
kanagabumaisom̐kulu kaḽalu dām̐kiṁchīnĕ

(||emi||)
yichchagavu nīgām̐gili yiṁpu gĕraliṁchīm̐gāni
hĕchchina radulĕllānu yĕlayiṁchīne
nichcha śhrīveṁkaḍeśhum̐ḍa nenu nāgudakkidivi
tachchi sannulu madam̐ga parvadamu miṁchīne