ఏమి సేతునే నేను యేదౌతాఁ దా నెరఁగఁడు
(॥పల్లవి॥)
ఏమి సేతునే నేను యేదౌతాఁ దా నెరఁగఁడు
దీమసము లేదు నాకు తెగి మీర లేను
(॥ఏమి॥)
దప్పితో నావిరహపుతలఁపులో తెగువలు
చెప్పుమంటా నాన వెట్టీఁ జెల్లఁబో వీఁడు
అప్పటి నేఁడేమి సేతు నవె వెళ్లనాడఁ బోతే
కుప్పళించీఁ బెంజెమట గుండె వక్కలాయను
(॥ఏమి॥)
కలలోనఁ దాను నేనుఁ గలసిన చేఁతలు
పలుకు మనుచుఁ గొంగు వట్టీ వీఁడు
యెలమి నే నేమి సేతు నేపాటి వాకుచ్చినాను
సెలవుల నవ్వు వచ్చి సిగ్గు ముంచీ నాకు
(॥ఏమి॥)
వడి నాకాఁగిట నెటువలెఁ గూడుదు ననుచు
నడువు మనుచు నన్ను నాదరించీని
కడు శ్రీవేంకటేశుఁడు కాఁగిటఁ గూడిన సుద్ది
వెడల నాడఁగ లేను వెరగయ్యీ నాకు
(||pallavi||)
emi sedune nenu yedaudām̐ dā nĕram̐gam̐ḍu
dīmasamu ledu nāgu tĕgi mīra lenu
(||emi||)
dappido nāvirahabudalam̐pulo tĕguvalu
sĕppumaṁṭā nāna vĕṭṭīm̐ jĕllam̐bo vīm̐ḍu
appaḍi nem̐ḍemi sedu navĕ vĕḽlanāḍam̐ bode
kuppaḽiṁchīm̐ bĕṁjĕmaḍa guṁḍĕ vakkalāyanu
(||emi||)
kalalonam̐ dānu nenum̐ galasina sem̐talu
palugu manusum̐ gŏṁgu vaṭṭī vīm̐ḍu
yĕlami ne nemi sedu nebāḍi vāguchchinānu
sĕlavula navvu vachchi siggu muṁchī nāgu
(||emi||)
vaḍi nāgām̐giḍa nĕḍuvalĕm̐ gūḍudu nanusu
naḍuvu manusu nannu nādariṁchīni
kaḍu śhrīveṁkaḍeśhum̐ḍu kām̐giḍam̐ gūḍina suddi
vĕḍala nāḍam̐ga lenu vĕragayyī nāgu