ఏమి సేతునయ్యా నీ విందరికి సముఁడవు
(॥పల్లవి॥)
ఏమి సేతునయ్యా నీ విందరికి సముఁడవు
ఆముకొని నినుఁ జూపి అందరి దూరీని
(॥ఏమి॥)
యెట్టకేలకుఁ దనతో యెన్నఁడో నవ్వితివంటా
వట్టిసలిగెఁ బొరలీ వంతుకు నాపె
గుట్టున నొకకడ నీకొలువు సేసితినంటా
బట్టబయలు గర్వించి పరచీ సవతుల
(॥ఏమి॥)
తెరమఱఁగున నీవు ద్రిష్టించి చూచితివంటా
దొతనాల మురిసీ దోడనె యాపె
ఇరవెఱఁగక నీవేమో మాటాడితివంటా
బెరసి పెచ్చు వెరిగీ ప్రియురాండ్లతోను
(॥ఏమి॥)
వూరకే యెప్పుడో పాదా లొత్తించుకొంటివంటా
తేరకె వేసాలుసేసీ దిక్కుల నాపె
గారవించి నేఁడు శ్రీవేంకటేశ నన్నేలితివి
దూఁరజూచీ నీ పట్టపుతొయ్యలులఁ దాను
(||pallavi||)
emi sedunayyā nī viṁdarigi samum̐ḍavu
āmugŏni ninum̐ jūbi aṁdari dūrīni
(||emi||)
yĕṭṭagelagum̐ danado yĕnnam̐ḍo navvidivaṁṭā
vaṭṭisaligĕm̐ bŏralī vaṁtugu nābĕ
guṭṭuna nŏgagaḍa nīgŏluvu sesidinaṁṭā
baṭṭabayalu garviṁchi parasī savadula
(||emi||)
tĕramaṟam̐guna nīvu driṣhṭiṁchi sūsidivaṁṭā
dŏdanāla murisī doḍanĕ yābĕ
iravĕṟam̐gaga nīvemo māḍāḍidivaṁṭā
bĕrasi pĕchchu vĕrigī priyurāṁḍladonu
(||emi||)
vūrage yĕppuḍo pādā lŏttiṁchugŏṁṭivaṁṭā
teragĕ vesālusesī dikkula nābĕ
gāraviṁchi nem̐ḍu śhrīveṁkaḍeśha nannelidivi
dūm̐rajūsī nī paṭṭabudŏyyalulam̐ dānu