ఏమి సేతునయ్య ఇఁక నిదివో మా బ్రదుకు
(॥పల్లవి॥)
ఏమి సేతునయ్య ఇఁక నిదివో మా బ్రదుకు
చే ముట్టిన సరసాలు సిగ్గులకే మూలము
(॥ఏమి॥)
తప్పులెంచఁబోతేను తగిలీ నీనుతులె
రెప్పలెత్తి చూడఁబోతే రేఁగీ వలపు
అప్పటిఁ బెనఁగఁబోతే ఆయములు గరఁగీని
యెప్పుడు నీతోడివాదు లింపులకే మూలము
(॥ఏమి॥)
చేతుల దొబ్బఁగఁబోతే చిమ్మిరేఁగీఁ బులకలు
గాతలఁ జంకించఁబోతే కమ్మీ నవ్వులు
యేతులు నెరపఁబోతే నెలయింపులై తోఁచీ
నీతోడిమచ్చరాలు నెయ్యానకే మూలము
(॥ఏమి॥)
కొప్పువట్టి తియ్యఁబోతే కూడీఁ బరవశము
ముప్పిరి నలుగఁబోతే ముంచీనాసలు
యిప్పుడే శ్రీవేంకటేశ యెనసితి విటు నన్ను
దెప్పరపునీతో రతి తేఁకువకే మూలము
(||pallavi||)
emi sedunayya im̐ka nidivo mā bradugu
se muṭṭina sarasālu siggulage mūlamu
(||emi||)
tappulĕṁcham̐bodenu tagilī nīnudulĕ
rĕppalĕtti sūḍam̐bode rem̐gī valabu
appaḍim̐ bĕnam̐gam̐bode āyamulu garam̐gīni
yĕppuḍu nīdoḍivādu liṁpulage mūlamu
(||emi||)
sedula dŏbbam̐gam̐bode simmirem̐gīm̐ bulagalu
gādalam̐ jaṁkiṁcham̐bode kammī navvulu
yedulu nĕrabam̐bode nĕlayiṁpulai tom̐sī
nīdoḍimachcharālu nĕyyānage mūlamu
(||emi||)
kŏppuvaṭṭi tiyyam̐bode kūḍīm̐ baravaśhamu
muppiri nalugam̐bode muṁchīnāsalu
yippuḍe śhrīveṁkaḍeśha yĕnasidi viḍu nannu
dĕpparabunīdo radi tem̐kuvage mūlamu