ఏమి సేతుమయ్య నిన్ను నేమిటా గెలువరాదు
(॥పల్లవి॥)
ఏమి సేతుమయ్య నిన్ను నేమిటా గెలువరాదు
అముకొనఁ జనవిచ్చి యాసలు రేఁచేవు
(॥॥)
పెనఁగితే బెళికి తప్పించుకొనఁ జూచేవు
చెనకితేఁ దలవంచి సిగ్గుపడేవు
మొనసి సన్న నేసితే మూతులు గిరిపేవు
ననుపు నటించితేను నవ్వులు నవ్వేవు
(॥॥)
నుడిగితే నెంతయినాఁ బొడవులు సూపేవు
తడవితే రాచపంతాలు మీరేవు
బడివాయకుండఁ గానే బాస లడుగ వచ్చేవు
వొడివట్టితే జలధి నెడము గొనేవు
(॥॥)
పొంచి మోము చూచితే పొందులే బోధించేవు
అంచల మొక్కితేనే వయ్యాళి చూపేవు
మంచితనాలనే నన్ను మన్నించితి విటు కూడి
ముంచి శ్రీవేంకటేశుఁడ మోవి లంచమిచ్చేవు
(||pallavi||)
emi sedumayya ninnu nemiḍā gĕluvarādu
amugŏnam̐ janavichchi yāsalu rem̐sevu
(||||)
pĕnam̐gide bĕḽigi tappiṁchugŏnam̐ jūsevu
sĕnagidem̐ dalavaṁchi siggubaḍevu
mŏnasi sanna neside mūdulu giribevu
nanubu naḍiṁchidenu navvulu navvevu
(||||)
nuḍigide nĕṁtayinām̐ bŏḍavulu sūbevu
taḍavide rāsabaṁtālu mīrevu
baḍivāyaguṁḍam̐ gāne bāsa laḍuga vachchevu
vŏḍivaṭṭide jaladhi nĕḍamu gŏnevu
(||||)
pŏṁchi momu sūside pŏṁdule bodhiṁchevu
aṁchala mŏkkidene vayyāḽi sūbevu
maṁchidanālane nannu manniṁchidi viḍu kūḍi
muṁchi śhrīveṁkaḍeśhum̐ḍa movi laṁchamichchevu