ఏమి సేతుమయ్య నీవు యింతటి నాయకుఁడవు
(॥పల్లవి॥)
ఏమి సేతుమయ్య నీవు యింతటి నాయకుఁడవు
మోము చూచి తొల్లే నీకు మోహించినదానను
(॥ఏమిసేతు॥)
వలపించవలె నొండె వశము గాకుండితేను
చెలరేఁగి ప్రియమైనాఁ జెప్పవలెను
పిలువ నంపఁగవలె బిగిసి రాకుండితేను
కొలువుకు వచ్చి కొంత గొసరఁగా వలెను
(॥ఏమిసేతు॥)
మెప్పించుకోవలె నొండె మించి కరఁగకుండితే
వుప్పతించ కోర్పుతోడ నుండవలెను
చిప్పిలఁ బెనఁగ గవలె చెలికి లోఁ గాకుండితే
చెప్పినట్టే వూడిగాలు సేయఁగవలెను
(॥ఏమిసేతు॥)
వంచుకొనవలె నొండె వహమానమున నుంటే
కొంచక పంతము లిచ్చి కూడవలెను
యెంచఁగ శ్రీవేంకటేశ యే నలమేల్మంగను
పొంచి నన్ను నేలితివి పొగడఁగవలెను
(||pallavi||)
emi sedumayya nīvu yiṁtaḍi nāyagum̐ḍavu
momu sūsi tŏlle nīgu mohiṁchinadānanu
(||emisedu||)
valabiṁchavalĕ nŏṁḍĕ vaśhamu gāguṁḍidenu
sĕlarem̐gi priyamainām̐ jĕppavalĕnu
piluva naṁpam̐gavalĕ bigisi rāguṁḍidenu
kŏluvugu vachchi kŏṁta gŏsaram̐gā valĕnu
(||emisedu||)
mĕppiṁchugovalĕ nŏṁḍĕ miṁchi karam̐gaguṁḍide
vuppadiṁcha korbudoḍa nuṁḍavalĕnu
sippilam̐ bĕnam̐ga gavalĕ sĕligi lom̐ gāguṁḍide
sĕppinaṭṭe vūḍigālu seyam̐gavalĕnu
(||emisedu||)
vaṁchugŏnavalĕ nŏṁḍĕ vahamānamuna nuṁṭe
kŏṁchaga paṁtamu lichchi kūḍavalĕnu
yĕṁcham̐ga śhrīveṁkaḍeśha ye nalamelmaṁganu
pŏṁchi nannu nelidivi pŏgaḍam̐gavalĕnu