Emi sedumamma nemu yeshodamma

ఏమి సేతుమమ్మ నేము యెశోదమ్మ
Language

(॥పల్లవి॥)
ఏమి సేతుమమ్మ నేము యెశోదమ్మ
గామిడితనములనే కడఁగీ బాలుఁడు

(॥ఏమి॥)
అందెలు మువ్వలు ఘల్లురనఁగ వీదివీదుల-
నందుక వుట్లు గొట్టీనదె బాలుఁడు
గొందినున్నఁ బోనీక కోలలు చాఁచిచాఁచి
పొందుగ దొండ్లువోవఁ బొడిచీ మీబాలుఁడు

(॥ఏమి॥)
చుంగలకాళతోడ సొరిది బాలులతోడ
ముంగిటి వుట్లు గొట్టీ ముద్దుబాలుఁడు
అంగవించి గొల్లెతలు అడ్డములురాఁగానే
యెంగిలిసేసీ మోవులు యిదిగో మీబాలుఁడు

(॥ఏమి॥)
చొల్లెపుజెడ వీఁపున సోయగమై వేలఁగాను
చిల్లరవుట్టు గొట్టీఁ జిన్నిబాలుఁడు
మెల్లనె సతులుఁ దాను మేలములాడుకొంటా
ఇల్లిదె శ్రీవేంకటాద్రి యెక్కెను మీ బాలుఁడు

(||pallavi||)
emi sedumamma nemu yĕśhodamma
gāmiḍidanamulane kaḍam̐gī bālum̐ḍu

(||emi||)
aṁdĕlu muvvalu ghalluranam̐ga vīdivīdula-
naṁduga vuṭlu gŏṭṭīnadĕ bālum̐ḍu
gŏṁdinunnam̐ bonīga kolalu sām̐sisām̐si
pŏṁduga dŏṁḍluvovam̐ bŏḍisī mībālum̐ḍu

(||emi||)
suṁgalagāḽadoḍa sŏridi bāluladoḍa
muṁgiḍi vuṭlu gŏṭṭī muddubālum̐ḍu
aṁgaviṁchi gŏllĕdalu aḍḍamulurām̐gāne
yĕṁgilisesī movulu yidigo mībālum̐ḍu

(||emi||)
sŏllĕbujĕḍa vīm̐puna soyagamai velam̐gānu
sillaravuṭṭu gŏṭṭīm̐ jinnibālum̐ḍu
mĕllanĕ sadulum̐ dānu melamulāḍugŏṁṭā
illidĕ śhrīveṁkaḍādri yĕkkĕnu mī bālum̐ḍu