Emi sedum jeppave yedi naa kubaayamu

ఏమి సేతుఁ జెప్పవే యేది నా కుపాయము
Language

(॥పల్లవి॥)
ఏమి సేతుఁ జెప్పవే యేది నా కుపాయము
ఆముకొన్న నా వలపు లాఁపరాదే చెలియా

(॥ఏమి॥)
కళరేఁగ వానిమేను కలువల వేతునా
కలయుమనుచు మొక్కి కాఁగిలింతునా
మొలకచన్నుల నొత్తి మొనగోరు దాఁకింతునా
పిలిచి పోకుండా నానవెట్టుదునా చెలియా

(॥ఏమి॥)
యీకడిమోమౌదాఁకా నెసగి సొలతునా
కైకొని పాదాలొత్తి కరఁగింతునా
జోకతో మోవితేనెలు సోఁకించి చొక్కింతునా
కోకకొంగుపట్టి వేఁడుకొందునా చెలియా

(॥ఏమి॥)
సురతపువిందుచెప్పి చూపులు నాఁటింతునా
సరుగ నిచ్చకముల జట్టిగొందునా
ఇరవై శ్రీవేంకటేశుఁ డింతలోనె నన్నుఁగూడె
సిరుల నేఁ బొగరి మెచ్చింతునా చెలియా

(||pallavi||)
emi sedum̐ jĕppave yedi nā kubāyamu
āmugŏnna nā valabu lām̐parāde sĕliyā

(||emi||)
kaḽarem̐ga vānimenu kaluvala vedunā
kalayumanusu mŏkki kām̐giliṁtunā
mŏlagasannula nŏtti mŏnagoru dām̐kiṁtunā
pilisi poguṁḍā nānavĕṭṭudunā sĕliyā

(||emi||)
yīgaḍimomaudām̐kā nĕsagi sŏladunā
kaigŏni pādālŏtti karam̐giṁtunā
jogado movidenĕlu som̐kiṁchi sŏkkiṁtunā
kogagŏṁgubaṭṭi vem̐ḍugŏṁdunā sĕliyā

(||emi||)
suradabuviṁdusĕppi sūbulu nām̐ṭiṁtunā
saruga nichchagamula jaṭṭigŏṁdunā
iravai śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ nannum̐gūḍĕ
sirula nem̐ bŏgari mĕchchiṁtunā sĕliyā