Emi sedum jeliyaa yelayimchee nidamdu

ఏమి సేతుఁ జెలియా యెలయించీ నితఁడు
Language

(॥పల్లవి॥)
ఏమి సేతుఁ జెలియా యెలయించీ నితఁడు
కామించి కామించి కరఁగీ నా మనసు

(॥ఏమి॥)
చెలిమి సేసినవాఁడు చేరి యెప్పుడు వచ్చీనో
మలసి యేమని నాతో మాఁటలాడీనో
నలిరేఁగి యెటువలె నవ్వులు నవ్వీనో
తలఁచి తలఁచి కడుఁ దమకించీ మనసు

(॥ఏమి॥)
మొగము చూచినవాఁడు మోహమెంత నెరపీనో
తగులై యెట్లా నన్ను దయసేసీనో
మిగులాఁ జుట్టరికమై మెచ్చి యేమి యిచ్చీనో
చిగిరించి చిగిరించి చిమ్మిరేఁగీ మనసు

(॥ఏమి॥)
సేసవెట్టినట్టివాఁడు సేవ లెటులాఁ గొనీనో
వేసరక రతి నెంత వెలయించీనో
ఆసల శ్రీవేంకటేశుఁ డలమేల్మంగను నేను
లాసి లాసి కూడె వుల్లాసించీ మనసు

(||pallavi||)
emi sedum̐ jĕliyā yĕlayiṁchī nidam̐ḍu
kāmiṁchi kāmiṁchi karam̐gī nā manasu

(||emi||)
sĕlimi sesinavām̐ḍu seri yĕppuḍu vachchīno
malasi yemani nādo mām̐ṭalāḍīno
nalirem̐gi yĕḍuvalĕ navvulu navvīno
talam̐si talam̐si kaḍum̐ damagiṁchī manasu

(||emi||)
mŏgamu sūsinavām̐ḍu mohamĕṁta nĕrabīno
tagulai yĕṭlā nannu dayasesīno
migulām̐ juṭṭarigamai mĕchchi yemi yichchīno
sigiriṁchi sigiriṁchi simmirem̐gī manasu

(||emi||)
sesavĕṭṭinaṭṭivām̐ḍu seva lĕḍulām̐ gŏnīno
vesaraga radi nĕṁta vĕlayiṁchīno
āsala śhrīveṁkaḍeśhum̐ ḍalamelmaṁganu nenu
lāsi lāsi kūḍĕ vullāsiṁchī manasu