Emi sedu ramanumda yevvari nemanam jaala

ఏమి సేతు రమణుఁడ యెవ్వరి నేమనఁ జాల
Language

(॥పల్లవి॥)
ఏమి సేతు రమణుఁడ యెవ్వరి నేమనఁ జాల
కామించి నీవు గన్నదే కానుపింతే కాకా

(॥ఏమి॥)
నాటకపు నినుఁ జూచి నగవు రావలదా
పాటించి నా కోప మడ్డపడీఁగాకా
కూటమై నోరికి మాట కొంత దోఁచవలదా
యేఁటికో గగ్గుత్తిక నన్నింత సేసీఁగాకా

(॥ఏమి॥)
యెదుట నే నిన్నుఁ గని యెదురుకో వలదా
వదలని నా చలము వద్దనీఁ గాకా
పొదిగి నీ వలమితేఁ బులకించ వలదా
వదరు నా వొట్టు నన్ను వాసి రేఁచీఁ గాకా

(॥ఏమి॥)
నిరతపు నీ రతికి నిన్ను మెచ్చ వలదా
పరవశములు నన్నుఁ బరచీఁ గాకా
గరిమె శ్రీవేంకటేశ కలసితి విటు నన్ను
వొరయఁగ వలదా నే నొక్క టయితిఁ గాకా

(||pallavi||)
emi sedu ramaṇum̐ḍa yĕvvari nemanam̐ jāla
kāmiṁchi nīvu gannade kānubiṁte kāgā

(||emi||)
nāḍagabu ninum̐ jūsi nagavu rāvaladā
pāḍiṁchi nā koba maḍḍabaḍīm̐gāgā
kūḍamai norigi māḍa kŏṁta dom̐savaladā
yem̐ṭigo gagguttiga nanniṁta sesīm̐gāgā

(||emi||)
yĕduḍa ne ninnum̐ gani yĕdurugo valadā
vadalani nā salamu vaddanīm̐ gāgā
pŏdigi nī valamidem̐ bulagiṁcha valadā
vadaru nā vŏṭṭu nannu vāsi rem̐sīm̐ gāgā

(||emi||)
niradabu nī radigi ninnu mĕchcha valadā
paravaśhamulu nannum̐ barasīm̐ gāgā
garimĕ śhrīveṁkaḍeśha kalasidi viḍu nannu
vŏrayam̐ga valadā ne nŏkka ṭayidim̐ gāgā