Emi sedu nimdugu ni nneduvale vemdugomdu

ఏమి సేతు నిందుకు ని న్నెటువలె వేఁడుకొందు
Language

(॥పల్లవి॥)
ఏమి సేతు నిందుకు ని న్నెటువలె వేఁడుకొందు
చే ముంచి నీ మోము చూడ సిగ్గయ్యీ నాకు

(॥ఏమి సేతు॥)
వేడక నాపె యింటికి విచ్చేయఁ గాఁ జూచి
వోడక నే లేవ నైతి నుడుకనను
యీడ నాతోఁ జెప్పే విను యెంత దోసకారినో
యీడ జో డై సవతిపో రింత సేసే నయ్యా

(॥ఏమి సేతు॥)
యిచ్చగించి ఆపెతేనె యిట్టె నవ్వఁగాఁ జూచి
మచ్చరాన నీతోడ మా టాడ నైతి
కచ్చుపెట్టి నే నెంత కట్టడి మతిదాననో
యెచ్చి నాజవ్వనమద మింత సేస నన్నును

(॥ఏమి సేతు॥)
గక్కన నాపైకు నీవు కనున్న నేయఁ జూచి
యెక్కువ నీ వున్నమంచ మెక్క నైతిని
అక్కర శ్రీవెంకటేశ అలమేలుమంగ నేను
యిక్కువ నీతోడికూట మింత నేనె నన్నునూ

(||pallavi||)
emi sedu niṁdugu ni nnĕḍuvalĕ vem̐ḍugŏṁdu
se muṁchi nī momu sūḍa siggayyī nāgu

(||emi sedu||)
veḍaga nābĕ yiṁṭigi vichcheyam̐ gām̐ jūsi
voḍaga ne leva naidi nuḍugananu
yīḍa nādom̐ jĕppe vinu yĕṁta dosagārino
yīḍa jo ḍai savadibo riṁta sese nayyā

(||emi sedu||)
yichchagiṁchi ābĕdenĕ yiṭṭĕ navvam̐gām̐ jūsi
machcharāna nīdoḍa mā ṭāḍa naidi
kachchubĕṭṭi ne nĕṁta kaṭṭaḍi madidānano
yĕchchi nājavvanamada miṁta sesa nannunu

(||emi sedu||)
gakkana nābaigu nīvu kanunna neyam̐ jūsi
yĕkkuva nī vunnamaṁcha mĕkka naidini
akkara śhrīvĕṁkaḍeśha alamelumaṁga nenu
yikkuva nīdoḍigūḍa miṁta nenĕ nannunū