ఏమి సేతు నిందుకు మందేమైనఁ బోయరాదా
(॥పల్లవి॥)
ఏమి సేతు నిందుకు మందేమైనఁ బోయరాదా
సామజగురుఁడ నీతో సంగమొల్ల దేఁటికే
(॥ఏమి॥)
మాయలసంసారము మరిగిన కర్మము
ఈయెడ నిను మరుగ దేఁటికో హరి
కాయజకేలిపైఁ దమిగలిగిన మనసు
కాయజుతండ్రి నీపైఁ గలుగ దిదేఁటికే
(॥ఏమి॥)
నాటకపుఁగనకము నమ్మినట్టిబదుకు
యేఁటికి నీభక్తి నమ్మదేలే హరి
గూఁటఁబడే పదవులు గోరేటిజీవుఁడు
కూటువైననిజముక్తి గోరడిఁది యేఁటికే
(॥ఏమి॥)
పాపపుణ్యములకె పాలుపడ్డ నేను
యేపున నీపాలఁ జిక్క నేలకో హరి
శ్రీపతివి నాలోని శ్రీవేంకటేశుఁడ
నీపేరివాఁడ నాకు నిండుమాయ లేఁటికే
(||pallavi||)
emi sedu niṁdugu maṁdemainam̐ boyarādā
sāmajagurum̐ḍa nīdo saṁgamŏlla dem̐ṭige
(||emi||)
māyalasaṁsāramu marigina karmamu
īyĕḍa ninu maruga dem̐ṭigo hari
kāyajagelibaim̐ damigaligina manasu
kāyajudaṁḍri nībaim̐ galuga didem̐ṭige
(||emi||)
nāḍagabum̐ganagamu namminaṭṭibadugu
yem̐ṭigi nībhakti nammadele hari
gūm̐ṭam̐baḍe padavulu goreḍijīvum̐ḍu
kūḍuvainanijamukti goraḍim̐di yem̐ṭige
(||emi||)
pābabuṇyamulagĕ pālubaḍḍa nenu
yebuna nībālam̐ jikka nelago hari
śhrībadivi nāloni śhrīveṁkaḍeśhum̐ḍa
nīberivām̐ḍa nāgu niṁḍumāya lem̐ṭige