Emi sedu nenimka nemdugaudune seliya

ఏమి సేతు నేనింక నెందుకౌదునే చెలియ
Language

(॥పల్లవి॥)
ఏమి సేతు నేనింక నెందుకౌదునే చెలియ
ప్రేమముఁ జలము రెండూఁ బెనఁగొనీఁ గదె

(॥ఏమి॥)
ఆతఁడు చేసినచేఁత కాతనినే చేసేఁగాక
దూతికవు నిన్నుఁజేయ దోసముగదే
కాతరించి నే నిన్నుఁగనక యేమి సేసినా
చేతులారా నాతనినే చేసినట్టుగదవే

(॥ఏమి॥)
గద్దించినపతినే గక్కనఁ జెనకుటగాక
వద్దనున్న దాని ముట్టవచ్చునటవే
అద్దుకొని యేమైనాఁగాని ఆతనిమారుగా నిన్నుఁ
గొద్దిమీరితే నందుకుఁగోప మారుఁగదవే

(॥ఏమి॥)
శ్రీవేంకటేశ్వరుని చేరి కొసరుటగాక
సేవకురాలిఁ దడవఁ జెల్లునటవే
యీవేళ నన్నుఁ గూడె నీతఁడే నిన్నంటె
మూవంకలా నాతనినే మోచి వచ్చుఁగదవే

(||pallavi||)
emi sedu neniṁka nĕṁdugaudune sĕliya
premamum̐ jalamu rĕṁḍūm̐ bĕnam̐gŏnīm̐ gadĕ

(||emi||)
ādam̐ḍu sesinasem̐ta kādanine sesem̐gāga
dūdigavu ninnum̐jeya dosamugade
kādariṁchi ne ninnum̐ganaga yemi sesinā
sedulārā nādanine sesinaṭṭugadave

(||emi||)
gaddiṁchinabadine gakkanam̐ jĕnaguḍagāga
vaddanunna dāni muṭṭavachchunaḍave
addugŏni yemainām̐gāni ādanimārugā ninnum̐
gŏddimīride naṁdugum̐goba mārum̐gadave

(||emi||)
śhrīveṁkaḍeśhvaruni seri kŏsaruḍagāga
sevagurālim̐ daḍavam̐ jĕllunaḍave
yīveḽa nannum̐ gūḍĕ nīdam̐ḍe ninnaṁṭĕ
mūvaṁkalā nādanine mosi vachchum̐gadave