ఏమి సేతు నెంత సేసే నిదేమే వీఁడు
(॥పల్లవి॥)
ఏమి సేతు నెంత సేసే నిదేమే వీఁడు
నా మోము వంచుకొని నవ్వుతా నుందాననే
(॥ఏమి॥)
జవ్వనముమీఁదుకట్టి జాజఱనే నోమఁగాను
యెవ్వఁడే వీఁడు నామోవి యెంగిలి సేసేని
యివ్వల నా మొకమోట మేమీ ననఁజాల కిట్టే
నివ్వెఱఁగుపడి యీడ నిలుచున్నదాననే
(॥ఏమి॥)
నిక్కుఁగుచగిరులను నిండు బోనాలు వోయఁగ
యిక్కువ లంటుకొనీ నేఁడేవ్వఁడే వీఁడు
యెక్కువ కళలు సోఁకి యిచ్చకము మానలేక
చెక్కిటిచేతితోడ సిగ్గున నుందాననే
(॥ఏమి॥)
సింగారము మేనఁ బూని చేరి తపము సేయఁగ
నంగవించి చెట్టవట్టీ నదేమే వీఁడు
యింగితపు శ్రీవేంకటేశుఁడే వీఁ డనఁగాను
చెంగటనే సంతసించి చెలువై యున్నదానను
(||pallavi||)
emi sedu nĕṁta sese nideme vīm̐ḍu
nā momu vaṁchugŏni navvudā nuṁdānane
(||emi||)
javvanamumīm̐dugaṭṭi jājaṟane nomam̐gānu
yĕvvam̐ḍe vīm̐ḍu nāmovi yĕṁgili seseni
yivvala nā mŏgamoḍa memī nanam̐jāla kiṭṭe
nivvĕṟam̐gubaḍi yīḍa nilusunnadānane
(||emi||)
nikkum̐gusagirulanu niṁḍu bonālu voyam̐ga
yikkuva laṁṭugŏnī nem̐ḍevvam̐ḍe vīm̐ḍu
yĕkkuva kaḽalu som̐ki yichchagamu mānalega
sĕkkiḍisedidoḍa sigguna nuṁdānane
(||emi||)
siṁgāramu menam̐ būni seri tabamu seyam̐ga
naṁgaviṁchi sĕṭṭavaṭṭī nademe vīm̐ḍu
yiṁgidabu śhrīveṁkaḍeśhum̐ḍe vīm̐ ḍanam̐gānu
sĕṁgaḍane saṁtasiṁchi sĕluvai yunnadānanu