ఏమి సేతు నీకు నే నీయింతి నింతె
(॥పల్లవి॥)
ఏమి సేతు నీకు నే నీయింతి నింతె
నీమేలే నామీఁద నెరపుమీ ఇపుడు
(॥ఏమి॥)
చిత్తములో నన్ను దయసేయఁగా నాలో
తత్తరాన నుండలేక తాఁకనాడితి
ఇత్తల నాతమకమె యింతసేసె నాతప్పు-
లెత్తి నీవాడిన నవి యెన్నైనఁ గలవు
(॥ఏమి॥)
యెదుట నీవుండఁగానే ఇందాఁక నెడసిన-
వుదుటుఁగాఁతాళాన నుప్పటించితి
కదిసినజవ్వనపుఁగాఁకఁ బడ్డదానఁగన
తుదమొద లెఱఁగ విందుకు నలుగకుమీ
(॥ఏమి॥)
అక్కున నీవు నన్ను నలమఁగా నంతలోనె
గక్కన నే ముందు నిన్నుఁ గాఁగింలిచితి
యెక్కువ శ్రీవేంకటేశ యెప్పుడును నీకు నే
మక్కువసతిఁ గనక మనసు చూచితిని
(||pallavi||)
emi sedu nīgu ne nīyiṁti niṁtĕ
nīmele nāmīm̐da nĕrabumī ibuḍu
(||emi||)
sittamulo nannu dayaseyam̐gā nālo
tattarāna nuṁḍalega tām̐kanāḍidi
ittala nādamagamĕ yiṁtasesĕ nādappu-
lĕtti nīvāḍina navi yĕnnainam̐ galavu
(||emi||)
yĕduḍa nīvuṁḍam̐gāne iṁdām̐ka nĕḍasina-
vuduḍum̐gām̐tāḽāna nuppaḍiṁchidi
kadisinajavvanabum̐gām̐kam̐ baḍḍadānam̐gana
tudamŏda lĕṟam̐ga viṁdugu nalugagumī
(||emi||)
akkuna nīvu nannu nalamam̐gā naṁtalonĕ
gakkana ne muṁdu ninnum̐ gām̐giṁlisidi
yĕkkuva śhrīveṁkaḍeśha yĕppuḍunu nīgu ne
makkuvasadim̐ ganaga manasu sūsidini