ఏమి సేతు నన్ను నేనే యేమనుకొందును
(॥పల్లవి॥)
ఏమి సేతు నన్ను నేనే యేమనుకొందును
ఆముకొని నీపై మోహ మడ్డ పెట్టఁ జాలను
(॥ఏమి॥)
చలములకోపనూ సాదించ నోపను
వలవ నోపుదు నీకు వాసితోను
మొలకలు చన్నులూ మొగమెల్లాఁ గన్నులూ
సొలసి సొలసి నిన్నుఁ జూడకుండఁ జాలను
(॥ఏమి॥)
మాయలేమీ నేరనూ మచ్చరించ నేరను
పాయకుండ నేరుతు నీ పాదాల వద్ద
అ(అ?)యాలు దాఁకె సిగ్గులు అంటె నవ్వులముగ్గులు
చాయలా సన్నలా సరసము లాఁపఁజాలను
(॥ఏమి॥)
వేసాలు నేఁ జేయను వెస నిందవేయను
సేవ వేతు నీమీఁద శ్రీ వేంకటేశ
రాసి నీవే కొనగోళ్లు రతులు వెన్నెల పోళ్లు
బాసలిచ్చి కూడితివి పచ్చి సేయఁజాలను
(||pallavi||)
emi sedu nannu nene yemanugŏṁdunu
āmugŏni nībai moha maḍḍa pĕṭṭam̐ jālanu
(||emi||)
salamulagobanū sādiṁcha nobanu
valava nobudu nīgu vāsidonu
mŏlagalu sannulū mŏgamĕllām̐ gannulū
sŏlasi sŏlasi ninnum̐ jūḍaguṁḍam̐ jālanu
(||emi||)
māyalemī neranū machchariṁcha neranu
pāyaguṁḍa nerudu nī pādāla vadda
a(a?)yālu dām̐kĕ siggulu aṁṭĕ navvulamuggulu
sāyalā sannalā sarasamu lām̐pam̐jālanu
(||emi||)
vesālu nem̐ jeyanu vĕsa niṁdaveyanu
seva vedu nīmīm̐da śhrī veṁkaḍeśha
rāsi nīve kŏnagoḽlu radulu vĕnnĕla poḽlu
bāsalichchi kūḍidivi pachchi seyam̐jālanu