ఏమి సేతు నమ్మలాల యిదివో నా కాఁపిరము
(॥పల్లవి॥)
ఏమి సేతు నమ్మలాల యిదివో నా కాఁపిరము
కామించి వలపు పతికాఁగిలే కోరీని
(॥ఏమి॥)
కాయమే కాఁకలఁ బొందీఁగానీ రమణునిఁ బాసి
పాయమే చిగురించీఁ బైపైనే
చేయి చెక్కిటిమీఁదఁ జింతలు రేఁచీఁగానీ
యేయెడఁ గనుచూపులు యెదురే చూచీని
(॥ఏమి॥)
పనివూని పయ్యదే పైపై జారీఁగానీ
ఘనమైన చన్నులైతే గట్టులయ్యీని
గొనకొన్న విరహము కోపము వుట్టించీఁగానీ
ననుపుల సెలవులు నవ్వింపించీని
(॥ఏమి॥)
గారవపునాకాఁగిలి కారాలు వుట్టించీఁగానీ
వూరేటిమోవితేనెలు వుట్టిపడీని
యీరీతి శ్రీవేంకటేశు డింతలో నన్నుఁ గలసె
తేరేటిమోముకళలు తెలివిసేసీని
(||pallavi||)
emi sedu nammalāla yidivo nā kām̐piramu
kāmiṁchi valabu padigām̐gile korīni
(||emi||)
kāyame kām̐kalam̐ bŏṁdīm̐gānī ramaṇunim̐ bāsi
pāyame siguriṁchīm̐ baibaine
seyi sĕkkiḍimīm̐dam̐ jiṁtalu rem̐sīm̐gānī
yeyĕḍam̐ ganusūbulu yĕdure sūsīni
(||emi||)
panivūni payyade paibai jārīm̐gānī
ghanamaina sannulaide gaṭṭulayyīni
gŏnagŏnna virahamu kobamu vuṭṭiṁchīm̐gānī
nanubula sĕlavulu navviṁpiṁchīni
(||emi||)
gāravabunāgām̐gili kārālu vuṭṭiṁchīm̐gānī
vūreḍimovidenĕlu vuṭṭibaḍīni
yīrīdi śhrīveṁkaḍeśhu ḍiṁtalo nannum̐ galasĕ
tereḍimomugaḽalu tĕlivisesīni