ఏమి సేతు నమ్మలాల యెఱుఁగక నేరిచితి
(॥పల్లవి॥)
ఏమి సేతు నమ్మలాల యెఱుఁగక నేరిచితి
కామించీ నిది సంగతి గాదన్నా మానఁడు
(॥ఏమి॥)
పండఁ బడి పానుపుపై పాడుమంటా నాచేతికి
దండె ఇచ్చీఁ జూడరే తన కెంతో
అండనే నే నోప నంటే ఆనవెట్టి తనమీఁద
దుండగపు నవ్వులతో దోస మన్నా మానఁడు
(॥ఏమి॥)
నెత్తమాడఁదనకు నే నేరుపు మంటా సారెలు
యెత్తి నాచేతికి నిచ్చీ నిదేమే తాను
కొత్తగాఁగా సిగ్గువడి కొంకితేఁ జేతులు వట్టి
మొత్తాన మారుకు మారు మొక్కే నన్నా మానఁడు
(॥ఏమి॥)
పట్టెమంచ మెక్కించుక పసలుగా గుద్దు మంటా
తొట్టి పాదాలు చాఁచీనే తొడలమీఁద
అట్టె శ్రీవేంకటేశుఁ డానపడి నన్నుఁ గూడె
జట్టిగాఁ బ్రియము చెప్పి చాలు నన్నా మానఁడు
(||pallavi||)
emi sedu nammalāla yĕṟum̐gaga nerisidi
kāmiṁchī nidi saṁgadi gādannā mānam̐ḍu
(||emi||)
paṁḍam̐ baḍi pānububai pāḍumaṁṭā nāsedigi
daṁḍĕ ichchīm̐ jūḍare tana kĕṁto
aṁḍane ne noba naṁṭe ānavĕṭṭi tanamīm̐da
duṁḍagabu navvulado dosa mannā mānam̐ḍu
(||emi||)
nĕttamāḍam̐danagu ne nerubu maṁṭā sārĕlu
yĕtti nāsedigi nichchī nideme tānu
kŏttagām̐gā sigguvaḍi kŏṁkidem̐ jedulu vaṭṭi
mŏttāna mārugu māru mŏkke nannā mānam̐ḍu
(||emi||)
paṭṭĕmaṁcha mĕkkiṁchuga pasalugā guddu maṁṭā
tŏṭṭi pādālu sām̐sīne tŏḍalamīm̐da
aṭṭĕ śhrīveṁkaḍeśhum̐ ḍānabaḍi nannum̐ gūḍĕ
jaṭṭigām̐ briyamu sĕppi sālu nannā mānam̐ḍu