ఏమి సేతు నమ్మలాల ఇట్టాయ నా వలపు
(॥పల్లవి॥)
ఏమి సేతు నమ్మలాల ఇట్టాయ నా వలపు
ప్రేమము చెప్పఁగరాదు పిలువక పోదు
(॥ఏమి॥)
మంతనాన నే నుంటే మనసులో నిలిచీని
కాంతుఁడు నే నిద్రించితేఁ గలలోన వచ్చీని
పంతమో పాడో తనకు బాలకి నన్నింతసేయ
రంతులఁ దానూ రాఁడు రానివాఁడు గాఁడు
(॥ఏమి॥)
పాడుతాఁ బరాకైతేఁ బదాలలో ముద్రచూపీ
గోడ చూచినఁ జిత్తరుకూటములోఁ బొడచూపీ
సూడో పాడో తనకు సొఁరది న న్నింతసేయ
యీడా నుండడుఁ చూడ నింటనే వున్నాఁడు
(॥ఏమి॥)
వూరకే నే నుండితేను వుంగరాన నెచ్చరించీ
ఆరయ శ్రీవేంకటేశుఁ డంతలోనె నన్నుఁ గూడె
నేరుపో నెయ్యమో నన్ను మన్నించి వురమున మోచె
తారుకాణించఁగరాదు తన కింకఁ బోదు
(||pallavi||)
emi sedu nammalāla iṭṭāya nā valabu
premamu sĕppam̐garādu piluvaga podu
(||emi||)
maṁtanāna ne nuṁṭe manasulo nilisīni
kāṁtum̐ḍu ne nidriṁchidem̐ galalona vachchīni
paṁtamo pāḍo tanagu bālagi nanniṁtaseya
raṁtulam̐ dānū rām̐ḍu rānivām̐ḍu gām̐ḍu
(||emi||)
pāḍudām̐ barāgaidem̐ badālalo mudrasūbī
goḍa sūsinam̐ jittarugūḍamulom̐ bŏḍasūbī
sūḍo pāḍo tanagu sŏm̐radi na nniṁtaseya
yīḍā nuṁḍaḍum̐ sūḍa niṁṭane vunnām̐ḍu
(||emi||)
vūrage ne nuṁḍidenu vuṁgarāna nĕchchariṁchī
āraya śhrīveṁkaḍeśhum̐ ḍaṁtalonĕ nannum̐ gūḍĕ
nerubo nĕyyamo nannu manniṁchi vuramuna mosĕ
tārugāṇiṁcham̐garādu tana kiṁkam̐ bodu