ఏమి సేతు నాతనికే యెదవెట్టుకొనఁ బట్టె
(॥పల్లవి॥)
ఏమి సేతు నాతనికే యెదవెట్టుకొనఁ బట్టె
నా మేనివెద గాదు నన్ను నే నేమందునే
(॥ఏమి॥)
కన్నీరు వెట్ట వెఱతు కాంతునిఁ బాసినందుకు
నన్నిటానాతని దూరే రందరు నంటా
చిన్నఁ బోయి వుండఁ జాల చెలు లాకోపానఁబోయి
తిన్ననిమాటల వాదు దీశే రంటాను
(॥ఏమి॥)
నిట్టూర్పు నించ వెఱతు నేఁ డాతఁడు రా నందుకు
దట్టమైన వుసు రట్టె తాఁకె నంటా
వెట్టఁ బొరలఁగఁ జాల వేఁడె నా మే నాతఁడు
ముట్టి చూచితే కాఁక ముంచునో యంటాను
(॥ఏమి॥)
మొత్తానఁ బానుపుమీఁదమూలఁ బండఁగ వెఱతు
చిత్తమునొచ్చి పతికి సిగ్గౌనో యంటా
ఇత్తల శ్రీవేంకటేశుఁ డింత సేసి నన్నుఁ గూడె
కొత్తలు సేయ వెఱతు కొంకువో యంటాను
(||pallavi||)
emi sedu nādanige yĕdavĕṭṭugŏnam̐ baṭṭĕ
nā menivĕda gādu nannu ne nemaṁdune
(||emi||)
kannīru vĕṭṭa vĕṟadu kāṁtunim̐ bāsinaṁdugu
nanniḍānādani dūre raṁdaru naṁṭā
sinnam̐ boyi vuṁḍam̐ jāla sĕlu lāgobānam̐boyi
tinnanimāḍala vādu dīśhe raṁṭānu
(||emi||)
niṭṭūrbu niṁcha vĕṟadu nem̐ ḍādam̐ḍu rā naṁdugu
daṭṭamaina vusu raṭṭĕ tām̐kĕ naṁṭā
vĕṭṭam̐ bŏralam̐gam̐ jāla vem̐ḍĕ nā me nādam̐ḍu
muṭṭi sūside kām̐ka muṁchuno yaṁṭānu
(||emi||)
mŏttānam̐ bānubumīm̐damūlam̐ baṁḍam̐ga vĕṟadu
sittamunŏchchi padigi siggauno yaṁṭā
ittala śhrīveṁkaḍeśhum̐ ḍiṁta sesi nannum̐ gūḍĕ
kŏttalu seya vĕṟadu kŏṁkuvo yaṁṭānu