ఏమి సేతు నాభాగ్యము యెఱిఁగీ నెఱుఁగ నీదు
(॥పల్లవి॥)
ఏమి సేతు నాభాగ్యము యెఱిఁగీ నెఱుఁగ నీదు
నామోహమే విుక్కుటమై నన్నుఁ దడఁబరచెను
(॥ఏమి॥)
భావించి నిన్నుఁ జూచితే పరవశమౌదుఁ గాని
ఆవేళ నీతో సరసమాడ మఱతు
చేవమీఱఁ దలఁచితే చిత్తము గరఁగుఁగాని
వోవరిలో గుబ్బల నిన్నొత్తి పట్ట మఱతు
(॥ఏమి॥)
గక్క నీ వెదురైతే కడు సిగ్గు రేఁగుఁగాని
పెక్కు వుపచారాల మెప్పించ మఱతు
తక్కక నీ వంటితేను తమకమే నిండుఁగాని
చొక్కించి నాచేఁతలు చూపఁగ మఱతు
(॥ఏమి॥)
జట్టిగా నిన్నుఁ గూడితే సంతోసమే నిండుఁగాని
గుట్టున నీమోవి చవిగొన మఱతు
యిట్టె శ్రీవేంకటేశ యే నలమేల్మంగను
నెట్టన నీగుణాలు వర్ణించ మఱతు
(||pallavi||)
emi sedu nābhāgyamu yĕṟim̐gī nĕṟum̐ga nīdu
nāmohame viుkkuḍamai nannum̐ daḍam̐barasĕnu
(||emi||)
bhāviṁchi ninnum̐ jūside paravaśhamaudum̐ gāni
āveḽa nīdo sarasamāḍa maṟadu
sevamīṟam̐ dalam̐side sittamu garam̐gum̐gāni
vovarilo gubbala ninnŏtti paṭṭa maṟadu
(||emi||)
gakka nī vĕduraide kaḍu siggu rem̐gum̐gāni
pĕkku vubasārāla mĕppiṁcha maṟadu
takkaga nī vaṁṭidenu tamagame niṁḍum̐gāni
sŏkkiṁchi nāsem̐talu sūbam̐ga maṟadu
(||emi||)
jaṭṭigā ninnum̐ gūḍide saṁtosame niṁḍum̐gāni
guṭṭuna nīmovi savigŏna maṟadu
yiṭṭĕ śhrīveṁkaḍeśha ye nalamelmaṁganu
nĕṭṭana nīguṇālu varṇiṁcha maṟadu