ఏమి సేతు నా వోజ ఇటువంటిది
(॥పల్లవి॥)
ఏమి సేతు నా వోజ ఇటువంటిది
కోమలపుదానఁ గానఁ గొసరేఁ గాక
(॥॥)
నిరతి నెఱఁగనా నీవు నన్ను లాలించేది
కెరలి మోహనఁ దమకించేఁ గాక
సరినెంచిచూడనా సతమైన నీగుణము
తరవాయి వచ్చుదాఁకాఁ దగిలేఁ గాక
(॥॥)
తలఁచనా తొల్లి నీవు దక్కినన్ను నేలినది
అలసినవిరహాన నాడేఁ గాక
తెలియనా నీనిజము తేటతెల్లమిగా నేను
తిలకించి చూచి వేడ్కఁ దివిరేఁ గాక
(॥॥)
ననుచనా నిన్నుఁ గూడి నాఁటనుండి కాఁగిట
మనసు చొక్కించినదాఁ కా మరిగేఁ గాక
యెనసితి విటు నన్ను నిదివో శ్రీ వేంకటేశ
తనిసి మందెమేళానఁ దడవేఁ గాక
(||pallavi||)
emi sedu nā voja iḍuvaṁṭidi
komalabudānam̐ gānam̐ gŏsarem̐ gāga
(||||)
niradi nĕṟam̐ganā nīvu nannu lāliṁchedi
kĕrali mohanam̐ damagiṁchem̐ gāga
sarinĕṁchisūḍanā sadamaina nīguṇamu
taravāyi vachchudām̐kām̐ dagilem̐ gāga
(||||)
talam̐sanā tŏlli nīvu dakkinannu nelinadi
alasinavirahāna nāḍem̐ gāga
tĕliyanā nīnijamu teḍadĕllamigā nenu
tilagiṁchi sūsi veḍkam̐ divirem̐ gāga
(||||)
nanusanā ninnum̐ gūḍi nām̐ṭanuṁḍi kām̐giḍa
manasu sŏkkiṁchinadām̐ kā marigem̐ gāga
yĕnasidi viḍu nannu nidivo śhrī veṁkaḍeśha
tanisi maṁdĕmeḽānam̐ daḍavem̐ gāga