Emi sedu naa manasu yemdugu nodambadadu

ఏమి సేతు నా మనసు యెందుకు నొడఁబడదు
Language

(॥పల్లవి॥)
ఏమి సేతు నా మనసు యెందుకు నొడఁబడదు
లాముని కంటికి నింత ఘనమైతిఁ గా

(॥ఏమి॥)
ఆడుదుఁబో వెంగెము లాతని మొగము చూచి
ఆడలేఁ బో వానిచిత్త మది నొచ్చుఁగా
కూడుదునో పానుపుపై కొంగువట్టి తీవతని
కూడితే నామతిలోనిగుట్టు గనుఁగా

(॥ఏమి॥)
అలుగుదునో నేను అతఁడు పైకొని రాఁగా
అలుగఁబో వానిఆయము సోఁకుఁగా
పిలుతునో ఆతని పేరుకొని నే నిట్టె
పిలిచితే నాలోని బీరమెల్లాఁ బోవుఁగా

(॥ఏమి॥)
చిమ్ముదునో కొనగోర శ్రీవేంకటేశ్వరుని
చిమ్మలేఁబో ఆతనిమై చిల్లులౌఁగా
వుమ్మడి నూరకుందునో వుడివోని రతులలో
ఉమ్మగిలి యట్లయితే వోటమి పైఁ బడుఁగా

(||pallavi||)
emi sedu nā manasu yĕṁdugu nŏḍam̐baḍadu
lāmuni kaṁṭigi niṁta ghanamaidim̐ gā

(||emi||)
āḍudum̐bo vĕṁgĕmu lādani mŏgamu sūsi
āḍalem̐ bo vānisitta madi nŏchchum̐gā
kūḍuduno pānububai kŏṁguvaṭṭi tīvadani
kūḍide nāmadiloniguṭṭu ganum̐gā

(||emi||)
aluguduno nenu adam̐ḍu paigŏni rām̐gā
alugam̐bo vāniāyamu som̐kum̐gā
piluduno ādani perugŏni ne niṭṭĕ
piliside nāloni bīramĕllām̐ bovum̐gā

(||emi||)
simmuduno kŏnagora śhrīveṁkaḍeśhvaruni
simmalem̐bo ādanimai sillulaum̐gā
vummaḍi nūraguṁduno vuḍivoni radulalo
ummagili yaṭlayide voḍami paim̐ baḍum̐gā