Emi sedu mogamoda midivo naagu

ఏమి సేతు మొగమోట మిదివో నాకు
Language

(॥పల్లవి॥)
ఏమి సేతు మొగమోట మిదివో నాకు
దీమసానఁ దిట్ట లేను దీవించ లేనూ

(॥ఏమి సేతు॥)
తోయ రాదు నీ మాఁట దొరవు నీ వాన తీఁగా
సేయ రా దటంటే నీవు చెప్పిన ట్టెల్ల
రాయడిసతుల మచ్చరము నాలో మాన లేను
వే యైనా నీ వారి పొందు విడిపించ లేనూ

(॥ఏమి సేతు॥)
తెగ రాదు నీమీఁద తేరి నన్నుఁ బొగడఁగ
నగ కుండ రాదు నీవు నవ్వించఁగ
వొగి నీ వెం దైనఁ బోతే వోరుచు కుండఁగ లేను
మగఁడవు నీ గుణాలు మట్టుపెట్ట లేను

(॥ఏమి సేతు॥)
పట్ట రాదు పాయ మిది పైకొని నీవు గూడఁగా
గుట్టు నేయ రాదు నీవు కొంగు వట్టఁగా
చుట్టాలఁ జేసితివి నీ సుదతుల నెల్లాఁ దెచ్చి
యిట్టె శ్రీవెంకటేశ యింక బాయ లేనూ

(||pallavi||)
emi sedu mŏgamoḍa midivo nāgu
dīmasānam̐ diṭṭa lenu dīviṁcha lenū

(||emi sedu||)
toya rādu nī mām̐ṭa dŏravu nī vāna tīm̐gā
seya rā daḍaṁṭe nīvu sĕppina ṭṭĕlla
rāyaḍisadula machcharamu nālo māna lenu
ve yainā nī vāri pŏṁdu viḍibiṁcha lenū

(||emi sedu||)
tĕga rādu nīmīm̐da teri nannum̐ bŏgaḍam̐ga
naga kuṁḍa rādu nīvu navviṁcham̐ga
vŏgi nī vĕṁ dainam̐ bode vorusu kuṁḍam̐ga lenu
magam̐ḍavu nī guṇālu maṭṭubĕṭṭa lenu

(||emi sedu||)
paṭṭa rādu pāya midi paigŏni nīvu gūḍam̐gā
guṭṭu neya rādu nīvu kŏṁgu vaṭṭam̐gā
suṭṭālam̐ jesidivi nī sudadula nĕllām̐ dĕchchi
yiṭṭĕ śhrīvĕṁkaḍeśha yiṁka bāya lenū