Emi saagiri vette vimtulanellaa

ఏమి సాకిరి వెట్టే వింతులనెల్లా
Language

(॥పల్లవి॥)
ఏమి సాకిరి వెట్టే వింతులనెల్లా
చే ముంచి కొనగోరఁ జెనకుదుఁగాక

(॥ఏమి॥)
మంకుతోడి మానిని మాటలాడీనా నీతో
జంకించి బొమ్మల నిన్ను సాదించుఁగాక
అంకెలఁ జెరఁగు వట్టి అట్టె లోనికిఁ దీసి
కంకిగాఁ గాఁగిట నిట్టే కలతువుగాక

(॥ఏమి॥)
మందెమేళమైన సతి మరియుఁ గిందుపడీనా
యెందునైనా నీవుర మెక్కుఁగాక
సందడి నీవె యాపెను చన్నులంటి పాన్పుపై
చిందర వందర సేసి చేకొందువుగాక

(॥ఏమి॥)
గబ్బితనమైన సతి ఘాతలకు లోఁగీనా
వుబ్బున నీమేనిట్టె వొరసుఁగాక
అబ్బురమై శ్రీవేంకటాధిప కూడితి విట్టె
నిబ్బరానఁ జనవిచ్చి నెరవేర్తుగాక

(||pallavi||)
emi sāgiri vĕṭṭe viṁtulanĕllā
se muṁchi kŏnagoram̐ jĕnagudum̐gāga

(||emi||)
maṁkudoḍi mānini māḍalāḍīnā nīdo
jaṁkiṁchi bŏmmala ninnu sādiṁchum̐gāga
aṁkĕlam̐ jĕram̐gu vaṭṭi aṭṭĕ lonigim̐ dīsi
kaṁkigām̐ gām̐giḍa niṭṭe kaladuvugāga

(||emi||)
maṁdĕmeḽamaina sadi mariyum̐ giṁdubaḍīnā
yĕṁdunainā nīvura mĕkkum̐gāga
saṁdaḍi nīvĕ yābĕnu sannulaṁṭi pānpubai
siṁdara vaṁdara sesi segŏṁduvugāga

(||emi||)
gabbidanamaina sadi ghādalagu lom̐gīnā
vubbuna nīmeniṭṭĕ vŏrasum̐gāga
abburamai śhrīveṁkaḍādhiba kūḍidi viṭṭĕ
nibbarānam̐ janavichchi nĕraverdugāga