ఏమి ఫలము దా నిన్నియునుఁ దెలిసినను
(॥పల్లవి॥)
ఏమి ఫలము దా నిన్నియునుఁ దెలిసినను
సాము సేసిన ఫలము జయశీలుఁడౌట గాక
(॥ఏమి॥)
తానుగలిగిన ఫలము దయ సేయఁగలుగుట
మేనుగలిగిన ఫలము మేలెల్ల గనుట
మానుషముగల ఫలము మంచివాఁడౌట తనుఁ
దానె తెలిసినఫలము తత్వపరుఁడౌట గాక
(॥ఏమి॥)
పదిలమగు కులము గల ఫలము తాఁజదువుట
చదివినఫలం బర్థసారంబు గనుట
పొదలి శాస్త్రర్థంబు పొడగన్న ఫలము మతి
దలఁకకిటు వేంకటేశుదాఁడౌట గాక
(||pallavi||)
emi phalamu dā ninniyunum̐ dĕlisinanu
sāmu sesina phalamu jayaśhīlum̐ḍauḍa gāga
(||emi||)
tānugaligina phalamu daya seyam̐galuguḍa
menugaligina phalamu melĕlla ganuḍa
mānuṣhamugala phalamu maṁchivām̐ḍauḍa tanum̐
dānĕ tĕlisinaphalamu tatvabarum̐ḍauḍa gāga
(||emi||)
padilamagu kulamu gala phalamu tām̐jaduvuḍa
sadivinaphalaṁ bardhasāraṁbu ganuḍa
pŏdali śhāstrardhaṁbu pŏḍaganna phalamu madi
dalam̐kagiḍu veṁkaḍeśhudām̐ḍauḍa gāga