ఏమి పరాకై వున్నాఁడ వెందాఁకాను
(॥పల్లవి॥)
ఏమి పరాకై వున్నాఁడ వెందాఁకాను
కామిని నింతటనైనాఁ గరుణించవయ్యా
(॥ఏమి॥)
కోలుముందుగా నాపె గోర గిలిగించఁగాను
నాలి వెట్టుకొని యేల నవ్వేవయ్యా
మేలు మేలనుచు నిన్ను మెచ్చిమెచ్చి పాడఁగా
జాలిదీర నాపెమోము చక్కఁ జూడవయ్యా
(॥ఏమి॥)
గరిమె నాపె చేతి కానుక నీకియ్యఁగాను
మరులేల కొలిపేవు మాటాడవయ్యా
సరసము చూపి నీతో జాణతనాలాడఁగాను
తరితీపులింకానా దగ్గరవయ్యా
(॥ఏమి॥)
పైకొని యట్టె కూడి పంతము నీకియ్యఁగాను
యీకె దలఁచినవెల్లా నీడేర్చవయ్యా
శ్రీకాంతుఁడవు నీవు శ్రీవేంకటేశ్వర
చేకొలఁదివాఁడవై సేవ గొనవయ్యా
(||pallavi||)
emi parāgai vunnām̐ḍa vĕṁdām̐kānu
kāmini niṁtaḍanainām̐ garuṇiṁchavayyā
(||emi||)
kolumuṁdugā nābĕ gora giligiṁcham̐gānu
nāli vĕṭṭugŏni yela navvevayyā
melu melanusu ninnu mĕchchimĕchchi pāḍam̐gā
jālidīra nābĕmomu sakkam̐ jūḍavayyā
(||emi||)
garimĕ nābĕ sedi kānuga nīgiyyam̐gānu
marulela kŏlibevu māḍāḍavayyā
sarasamu sūbi nīdo jāṇadanālāḍam̐gānu
taridībuliṁkānā daggaravayyā
(||emi||)
paigŏni yaṭṭĕ kūḍi paṁtamu nīgiyyam̐gānu
yīgĕ dalam̐sinavĕllā nīḍersavayyā
śhrīgāṁtum̐ḍavu nīvu śhrīveṁkaḍeśhvara
segŏlam̐divām̐ḍavai seva gŏnavayyā