Emi nomu nosinado yee yimti

ఏమి నోము నోచినదో యీ యింతి
Language

(॥పల్లవి॥)
ఏమి నోము నోచినదో యీ యింతి
కామించి కన్నులారఁ గంటిమి మీ పొందులు

(॥ఏమి॥)
చిత్తగించి నిన్నుఁజూచి సిగ్గువడీ నిదివో
కొత్తపెండ్లి కూఁతురు యీకొమ్మగాఁబోలు
మొత్తమి నీమాట విని ముసిముసినవ్వు నవ్వీ
జొత్తైనతొల్లిటినీచుట్టముగాఁ బోలును

(॥ఏమి॥)
అగపడి సరసములాడితే సమ్మతించీని
తగిననీ మేనమఱఁదలు గాఁబోలు
పగటున నీవుగుప్పేపచ్చడము గప్పుకొనీ
జగమెఱఁగఁగ నీకు చనవరి గాఁబోలు

(॥ఏమి॥)
వొనరఁ బానుపుమీఁద నుండి నీపాదములొత్తీ
యెనసి వూడిగమాపె యీకె గాఁబోలు
నను నేలితివి ముందే నంటున శ్రీవేంకటేశ
నిన్నుఁ జెనకీఁ దానూ నేస్తము గాఁబోలు

(||pallavi||)
emi nomu nosinado yī yiṁti
kāmiṁchi kannulāram̐ gaṁṭimi mī pŏṁdulu

(||emi||)
sittagiṁchi ninnum̐jūsi sigguvaḍī nidivo
kŏttabĕṁḍli kūm̐turu yīgŏmmagām̐bolu
mŏttami nīmāḍa vini musimusinavvu navvī
jŏttainadŏlliḍinīsuṭṭamugām̐ bolunu

(||emi||)
agabaḍi sarasamulāḍide sammadiṁchīni
taginanī menamaṟam̐dalu gām̐bolu
pagaḍuna nīvuguppebachchaḍamu gappugŏnī
jagamĕṟam̐gam̐ga nīgu sanavari gām̐bolu

(||emi||)
vŏnaram̐ bānubumīm̐da nuṁḍi nībādamulŏttī
yĕnasi vūḍigamābĕ yīgĕ gām̐bolu
nanu nelidivi muṁde naṁṭuna śhrīveṁkaḍeśha
ninnum̐ jĕnagīm̐ dānū nestamu gām̐bolu