ఏమి నోము నోమితివే యింతక తొల్లి
(॥పల్లవి॥)
ఏమి నోము నోమితివే యింతక తొల్లి
కామించఁదగునే నీకు గక్కన నీ విభుఁడు
(॥ఏమి॥)
వెలఁది నీమాఁటలు విన నింపులు
కలికితనాలు చెప్పఁగడుఁగొత్తలు
తలఁప నీవినయాలు తరితీఁపులు
వలవ కెట్టుండునమ్మ వడి నీకు విభుఁడు
(॥ఏమి॥)
సూటి నీచక్కదనాలు చూడవేడుక
గాఁటవు నీ చూపులకు కరఁగు మతి
నీటు నీ సింగారమైతే నిచ్చపండుగ
కూటమిగా కెట్టుండునే కూరిమి నీ విభుఁడు
(॥ఏమి॥)
నెక్కొన్న నీ చిరునవ్వు నిండువెన్నెల
చొక్కపు నీ మోవితీపు జుంటితేనె
యెక్కుడాయ నీ భావాలిట్టె కాఁగిటఁ
జిక్క కెట్లుండు నిఁక శ్రీవేంకటవిభుఁడు
(||pallavi||)
emi nomu nomidive yiṁtaga tŏlli
kāmiṁcham̐dagune nīgu gakkana nī vibhum̐ḍu
(||emi||)
vĕlam̐di nīmām̐ṭalu vina niṁpulu
kaligidanālu sĕppam̐gaḍum̐gŏttalu
talam̐pa nīvinayālu taridīm̐pulu
valava kĕṭṭuṁḍunamma vaḍi nīgu vibhum̐ḍu
(||emi||)
sūḍi nīsakkadanālu sūḍaveḍuga
gām̐ṭavu nī sūbulagu karam̐gu madi
nīḍu nī siṁgāramaide nichchabaṁḍuga
kūḍamigā kĕṭṭuṁḍune kūrimi nī vibhum̐ḍu
(||emi||)
nĕkkŏnna nī sirunavvu niṁḍuvĕnnĕla
sŏkkabu nī movidību juṁṭidenĕ
yĕkkuḍāya nī bhāvāliṭṭĕ kām̐giḍam̐
jikka kĕṭluṁḍu nim̐ka śhrīveṁkaḍavibhum̐ḍu