ఏమి నేరుచుకొంటివి యెంత సేసేవు నన్ను
(॥పల్లవి॥)
ఏమి నేరుచుకొంటివి యెంత సేసేవు నన్ను
వేమరు నా పొందు లింత వేడుకయ్యీనా
(॥ఏమి॥)
మన్నించి నాతో నీవు మతకాలాడేవుగాక
కన్నుల నాచూపు నిన్నుఁ గాఁడిపారీనా
వన్నెల నందరిలో నావాసు లెక్కించేవు గాక
చిన్నినాసెలవినవ్వు చిమ్మిరేఁచీనా
(॥ఏమి॥)
గారవించి నాపై నొకకత గడించేవుగాక
వూరకే నామోవి నీనోరూరించీనా
పేరఁ బెట్టి వలపులు పెంచేవుగాక నేఁడు
సారె నాచన్నులు నీపై చవుకళించీనా
(॥ఏమి॥)
వుమ్మడి నీరతుల నన్నుబ్బించే వింతేకాక
కమ్మి నాకాగిలి నిన్నుఁ గరఁగించీనా
ఇమ్ముల శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
పమ్మి నాకూటమి నిన్ను బయలీఁదించీనా
(||pallavi||)
emi nerusugŏṁṭivi yĕṁta sesevu nannu
vemaru nā pŏṁdu liṁta veḍugayyīnā
(||emi||)
manniṁchi nādo nīvu madagālāḍevugāga
kannula nāsūbu ninnum̐ gām̐ḍibārīnā
vannĕla naṁdarilo nāvāsu lĕkkiṁchevu gāga
sinnināsĕlavinavvu simmirem̐sīnā
(||emi||)
gāraviṁchi nābai nŏgagada gaḍiṁchevugāga
vūrage nāmovi nīnorūriṁchīnā
peram̐ bĕṭṭi valabulu pĕṁchevugāga nem̐ḍu
sārĕ nāsannulu nībai savugaḽiṁchīnā
(||emi||)
vummaḍi nīradula nannubbiṁche viṁtegāga
kammi nāgāgili ninnum̐ garam̐giṁchīnā
immula śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
pammi nāgūḍami ninnu bayalīm̐diṁchīnā