Emi nerusugomtivi yelayimchevu sadula

ఏమి నేరుచుకొంటివి యెలయించేవు సతుల
Language

(॥పల్లవి॥)
ఏమి నేరుచుకొంటివి యెలయించేవు సతుల
కామించి వచ్చినవారిఁ గరుణించవయ్యా

(॥ఏమి॥)
కానుకంపె యాపె వేళ గాచుకొనియుండఁగాను
వీనుల విన్నాపెను వెదకించేవు
మోనముతోఁ జేతులెత్తి మొక్కి యాపెవుండఁగాను
అనుకొని వీదినుండి యాపెవంకఁ జూచేవు

(॥ఏమి॥)
వీలనున్నయాపె నీకు విన్నపాలు సేయఎగాను
మాటుననున్నాపె తోను మాటలాడేవు
సాటికిఁ జుట్టమైనాపె సరసములాడఁగాను
నాటకపుతితోడ నవ్వులు నవ్వేవు

(॥ఏమి॥)
లలమేలుమంగ యాపె అక్కుననేవుండఁగాను
కొలువులోనున్నా పెను గోర నొత్తేవు
నెలవై శ్రీవేంకటేశ నే నూడిగము సేయఁగా
చెలికత్తెయినాపెఁ గని సిగ్గునఁ గొంకేవు

(||pallavi||)
emi nerusugŏṁṭivi yĕlayiṁchevu sadula
kāmiṁchi vachchinavārim̐ garuṇiṁchavayyā

(||emi||)
kānugaṁpĕ yābĕ veḽa gāsugŏniyuṁḍam̐gānu
vīnula vinnābĕnu vĕdagiṁchevu
monamudom̐ jedulĕtti mŏkki yābĕvuṁḍam̐gānu
anugŏni vīdinuṁḍi yābĕvaṁkam̐ jūsevu

(||emi||)
vīlanunnayābĕ nīgu vinnabālu seyægānu
māḍunanunnābĕ tonu māḍalāḍevu
sāḍigim̐ juṭṭamainābĕ sarasamulāḍam̐gānu
nāḍagabudidoḍa navvulu navvevu

(||emi||)
lalamelumaṁga yābĕ akkunanevuṁḍam̐gānu
kŏluvulonunnā pĕnu gora nŏttevu
nĕlavai śhrīveṁkaḍeśha ne nūḍigamu seyam̐gā
sĕligattĕyinābĕm̐ gani siggunam̐ gŏṁkevu