Emi nerusugomtivi yegasakkelu

ఏమి నేరుచుకొంటివి యెగసక్కేలు
Language

(॥పల్లవి॥)
ఏమి నేరుచుకొంటివి యెగసక్కేలు
నీ మతకమంతయును నీకే తెలుసును

(॥ఏమి॥)
వలపులు మున్ను రేఁచి వద్దికి వచ్చితే మరి
చలములు సాదింతురా సకియలను
పిలిచి పేరుకొనఁగా ప్రియమున నూఁకొంటే
పలుకకుండుదురా పంతముతోను

(॥ఏమి॥)
అగ్గలముగా నవ్వి ఆయములు గరఁగితే
సిగ్గులు వరతురా చెలువలను
వొగ్గి యాసలు వుట్టించి వూరకే కాలుదొక్కితే
యెగ్గులు వట్టుదురా ఇంతలోనను

(॥ఏమి॥)
జట్టిగాఁ గాఁగిటఁ గూడి సమరతిఁ గొసరితే
తిట్టులు దిట్టుదురా తెఱవలను
ఇట్టె శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నేఁడు
గుట్టు సేతురా ఇఁకఁ గూరిమితోను

(||pallavi||)
emi nerusugŏṁṭivi yĕgasakkelu
nī madagamaṁtayunu nīge tĕlusunu

(||emi||)
valabulu munnu rem̐si vaddigi vachchide mari
salamulu sādiṁturā sagiyalanu
pilisi perugŏnam̐gā priyamuna nūm̐kŏṁṭe
palugaguṁḍudurā paṁtamudonu

(||emi||)
aggalamugā navvi āyamulu garam̐gide
siggulu varadurā sĕluvalanu
vŏggi yāsalu vuṭṭiṁchi vūrage kāludŏkkide
yĕggulu vaṭṭudurā iṁtalonanu

(||emi||)
jaṭṭigām̐ gām̐giḍam̐ gūḍi samaradim̐ gŏsaride
tiṭṭulu diṭṭudurā tĕṟavalanu
iṭṭĕ śhrī veṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
guṭṭu sedurā im̐kam̐ gūrimidonu