ఏమి నేరుచుకొంటివే యెంత కుచ్చితురాలవే
(॥పల్లవి॥)
ఏమి నేరుచుకొంటివే యెంత కుచ్చితురాలవే
జాము వోయినా మానవు చలమే సాదించేవు
(॥ఏమి॥)
చూడఁ జాల వేమే యే సుదతితో మాటాడిన
యేడా చుట్టాలు లేరా యెవ్వరి కైనా
కూడీఁ గూడక తొల్లె కొడిమెలే కట్టేవు
వాడలో నుండ బాసెఁగా వన్నెమగవానికి
(॥ఏమి॥)
వుడికి పడే విదేమే వూరివారితో నవ్వితే
విడువ కెవ్వరి కైనా వేడుకె లేదా
కడ నున్నవారిమీఁద కానివావులు వేసేవు
తడవి మగవానికి తల యెత్తఁ బాసెఁగా
(॥ఏమి॥)
చిన్నఁబొయ్యే విది యేమే చెలుల నేఁ బిలిచితే
యెన్న కె ముచ్చట లేదా యెవ్వరి కైనా
చెన్నుగా నుర మెక్కితి శ్రీవెంకటేశుఁడ నేను
యిన్నిటాఁ గూడ బాసెఁగా యితరకాంతలను
(||pallavi||)
emi nerusugŏṁṭive yĕṁta kuchchidurālave
jāmu voyinā mānavu salame sādiṁchevu
(||emi||)
sūḍam̐ jāla veme ye sudadido māḍāḍina
yeḍā suṭṭālu lerā yĕvvari kainā
kūḍīm̐ gūḍaga tŏllĕ kŏḍimĕle kaṭṭevu
vāḍalo nuṁḍa bāsĕm̐gā vannĕmagavānigi
(||emi||)
vuḍigi paḍe videme vūrivārido navvide
viḍuva kĕvvari kainā veḍugĕ ledā
kaḍa nunnavārimīm̐da kānivāvulu vesevu
taḍavi magavānigi tala yĕttam̐ bāsĕm̐gā
(||emi||)
sinnam̐bŏyye vidi yeme sĕlula nem̐ biliside
yĕnna kĕ muchchaḍa ledā yĕvvari kainā
sĕnnugā nura mĕkkidi śhrīvĕṁkaḍeśhum̐ḍa nenu
yinniḍām̐ gūḍa bāsĕm̐gā yidaragāṁtalanu