Emi neṟumganu nenu imka neesittamuraa

ఏమి నెఱుఁగను నేను ఇఁక నీచిత్తమురా
Language

(॥పల్లవి॥)
ఏమి నెఱుఁగను నేను ఇఁక నీచిత్తమురా
దోమటి వయసు నాపైఁ దోసినట్టె తోయరా

(॥॥)
తలఁపెల్లా నీది తమకమే నాది
చెలగి యేమిసేసినాఁ జేయరా నీవు
పలుకు నీతోనే పంతమే నాలోను
చలివలపులు నాపైఁ జల్లినట్టు చల్లరా

(॥॥)
వాలుఁ జూవులు నాపై వడియుఁ జెమట నాపై
కేల నాచన్నులు పిసికినట్ట్టే పిసుకరా
ఆలకింపు నీకొరకు ఆలయిక నాకొరకు
నాలిసేసి నీవు నాతో నవ్వినట్టే నవ్వరా

(॥॥)
కాగిలిదె నీకు కళదాఁకేది నాకు
యేఁగక నీమోవి నాకు నిచ్చినంతా వియ్యరా
పాఁగినశ్రీవేంకటేశ పైకొని కూడితినదె
ఆఁగె నిద్దరిమనసు లంటినట్టె యంటరా

(||pallavi||)
emi nĕṟum̐ganu nenu im̐ka nīsittamurā
domaḍi vayasu nābaim̐ dosinaṭṭĕ toyarā

(||||)
talam̐pĕllā nīdi tamagame nādi
sĕlagi yemisesinām̐ jeyarā nīvu
palugu nīdone paṁtame nālonu
salivalabulu nābaim̐ jallinaṭṭu sallarā

(||||)
vālum̐ jūvulu nābai vaḍiyum̐ jĕmaḍa nābai
kela nāsannulu pisiginaṭṭṭe pisugarā
ālagiṁpu nīgŏragu ālayiga nāgŏragu
nālisesi nīvu nādo navvinaṭṭe navvarā

(||||)
kāgilidĕ nīgu kaḽadām̐kedi nāgu
yem̐gaga nīmovi nāgu nichchinaṁtā viyyarā
pām̐ginaśhrīveṁkaḍeśha paigŏni kūḍidinadĕ
ām̐gĕ niddarimanasu laṁṭinaṭṭĕ yaṁṭarā