Emi nerubulu soobe vemdaamkaanu

ఏమి నేరుపులు చూపే వెందాఁకాను
Language

(॥పల్లవి॥)
ఏమి నేరుపులు చూపే వెందాఁకాను
కామించి నీ పట్టు కతికడవలేఁ గాక

(॥ఏమి॥)
ఆకెతో మాటాడఁగా నేమందునోయంటా నీవు
నాకున మాటాడేవు వంతుకు నాతో
పైకొని నాపై నంతబత్తి గద్దా నీ కేమైనా
నీకు మోహించినదాన నేఁ బాయలేఁగాక

(॥ఏమి॥)
నెట్టన నాపెతో నవ్వి నేఁ గోపగించేనంటా
నట్టనడుమ నూరకే నవ్వేవు నాతో
బట్టబయలు నే నీకు బాఁతే ఇందరిలోనా
అట్టిట్టని నీతోను అలుగలేఁగాక

(॥ఏమి॥)
అలమేలుమంగఁ గూడి అట్టె నన్ను బుజ్జగించఁ
గలసితి నిటు భూకాంత నేనంటా
యెలమి శ్రీవేంకటేశ ఇంతకరుణా నాపై
మలసి యెంతైనా నిన్ను మరవలేఁగాక

(||pallavi||)
emi nerubulu sūbe vĕṁdām̐kānu
kāmiṁchi nī paṭṭu kadigaḍavalem̐ gāga

(||emi||)
āgĕdo māḍāḍam̐gā nemaṁdunoyaṁṭā nīvu
nāguna māḍāḍevu vaṁtugu nādo
paigŏni nābai naṁtabatti gaddā nī kemainā
nīgu mohiṁchinadāna nem̐ bāyalem̐gāga

(||emi||)
nĕṭṭana nābĕdo navvi nem̐ gobagiṁchenaṁṭā
naṭṭanaḍuma nūrage navvevu nādo
baṭṭabayalu ne nīgu bām̐te iṁdarilonā
aṭṭiṭṭani nīdonu alugalem̐gāga

(||emi||)
alamelumaṁgam̐ gūḍi aṭṭĕ nannu bujjagiṁcham̐
galasidi niḍu bhūgāṁta nenaṁṭā
yĕlami śhrīveṁkaḍeśha iṁtagaruṇā nābai
malasi yĕṁtainā ninnu maravalem̐gāga